శాస్త్రిగారి జీవన యానము అనంతపురం జిల్లా హిందూపురానికిఐదుకిలోమీటర్లదూరంలోనిమణేసముద్రంఓకుగ్రామం.శతాబ్దికాలానికి పూర్వంబ్రహ్మశ్రీ మాడ్గుల వేంకటేశ్వరశాస్త్రి అనే వేదశాస్త్రపండితులు ఈ గ్రామంలో నివసించేవారు. ఆయనది ఆయుర్వేద వైద్యశాస్త్రంలోకూడా అందెవేసినచెయ్యి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్యం చేయించుకోవడానికి వీరి వద్దకుజనాలు తండోపతండాలుగావచ్చేవారు. వేంకటేశ్వరశాస్త్రిగారి హస్తవాసి మంచిదనే పేరు ప్రజల్లోకి వెళ్ళింది.
అయితేఎవరివద్దనుంచీఅణా పైసాకూడా తీసుకోకుండా ఉచితంగా చికిత్సచేసిపంపేవారుశాస్త్రి గారు.మరోవైపుతమవంశపారంపర్యమైన పౌరోహిత్యవైదిక కార్యక్రమాలను కూడా నిరాటంకంగా నిర్వహించేవారు. లోక క్షేమం కోసం వీరు చేసే యజ్ఞయాగాది క్రతువులకారణంగా గ్రామమంతాసస్యశ్యామలంగా విలసిల్లుతూ ఉండేది.
శాస్త్రిగారి ధర్మపత్నిసావిత్రమ్మపేరుకు తగ్గట్టుగానే ఉత్తమ ఇల్లాలు.భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది.వీరిరువురికి తొలుతఒకకుమార్తె జన్మించింది.శాస్త్రిగారుతమతల్లిగారైనభాగీరథమ్మగారిని తలచుకొని ఆ శిశువుకు భాగీరథి అని పేరు పెట్టారు.తదుపరి శ్రీరక్తాక్షినామసంవత్సర ఫాల్గుణశుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బ నక్షత్రం సింహరాశిలో (10-03-1925వ సంవత్సరంలో) బ్రహ్మశ్రీ మాడ్గుల వేంకటేశ్వరశాస్త్రిగారికి పుత్రసంతానంకలిగింది.కులదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పేరు, అపారమైన శివభక్తి తత్పరుడైనందున శివునిపేరుకలిసేటట్లు వేంకటశివశాస్త్రి అని పేరు పెట్టుకుని మురిసిపోయారు శాస్త్రి దంపతులు.
వీరి రెండవ కుమారుని పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. వేంకట శివ శాస్త్రికి ఎనిమిది సంవత్సరాలవయస్సు,సుబ్రహ్మణ్య శాస్త్రికినాలుగు సంవత్సరాలవయస్సు వచ్చే సరికి హఠాత్తుగా తండ్రి వేంకటేశ్వర శాస్త్రి తనువు చాలించారు. ముగ్గురు పిల్లల పోషణభారంతల్లిసావిత్రమ్మపై పడింది.శ్రోత్రియ భూస్వాములైనప్పటికీ భర్త గతించడంతో పూటగడవడం కష్టంగా మారింది.
ఎలాగోలాకుటుంబభారాన్నినెట్టుకొచ్చిందిసావిత్రమ్మ. కూతురు భాగీరథిని పందిపర్తిలోదేవరకొండ వేంకటపతిరావుఅనేయువకునికిచ్చి పెండ్లి చేసింది.ఈయనవీరికిదగ్గరబంధువు కూడా. .శాస్త్రిగారి ఇంటికి వెనుకేనివాసముండే కళ్ళేనరసింహ శాస్త్రి-గౌరమ్మదంపతులువరకటశివ శాస్త్రిని,సుబ్రహ్మణ్య శాస్త్రిని అక్కున చేర్చుకొని ఉపనయనం చేసి వేదవిద్య నేర్పించసాగారు.
© 2017,www.logili.com All Rights Reserved.