జీవితంలో అనివార్యమైన వేదన, బాధల కొలిమిలో నుండి ఆనందాన్ని ఎలా సాధించాలి అనే విషయం ఈ పుస్తకంలోని ప్రధానాంశం. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా, దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు ఆర్చిబిషప్ డెస్మండ్ టుటు ఏప్రియల్ 2015లో వారం రోజుల పాటు జరిపిన సంభాషణ ఈ పుస్తకానికి ప్రాతిపదిక.
మానవాళిని ఉన్నతమైన విలువల ఆధారంగా ముందుకు నడిపించటం ద్వారా మరింత మెరుగైన మానవ జీవితం, మానవ సమాజం సాధ్యమవుతాయని వీరిరువురు భావించారు. ఇందుకోసం వీరు ప్రతిపాదించిన విలువల క్రోడీకరణే ఈ పుస్తకం. ఇతరుల కోసం జీవించడంలోనే నిజమైన ఆనందం ఇమిడి ఉందనేది ఈ పుస్తకం చేసిన అంతిమ ప్రతిపాదన. మానవ స్వభావం ఇందుకనుగుణమైనదని వీరిరువురూ భావించారు.
మానవతావాదం ఈ పుస్తకం తాత్విక భూమిక. మానవ సమాజాన్ని సమానత్వం, స్వేచ్ఛ ప్రాతిపదికగా పునర్నిర్మించే ఏ ప్రయత్నానికైనా సమున్నతమైన విలువలు ప్రాతిపదికగా ఉండాలి. అట్టి విలువలుగా మనం భావించే వాటిని బేరీజు వేసుకోవడానికి, సమీక్షించుకోవడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. దలైలామా, డెస్మండ్ టుటుల సంభాషణని డగ్లస్ అబ్రామ్స్ ఆంగ్లంలో గ్రంథస్థం చేశారు. ఆంగ్ల మూలాన్ని సంక్షిప్తంగా తెలుగులోకి అనువదించినది రావెల సాంబశివరావు.
© 2017,www.logili.com All Rights Reserved.