Title | Price | |
Shathakamulu (Vemana, Sumathi, Bhaskara, Krishna) | Rs.150 | In Stock |
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి భోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, నరసింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది.
శతకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపకశక్తి, ధారాశుద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభావము, దైవ చింతన వృద్ధి పొందుతాయి. సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, సంస్కృతీ సంప్రదాయ నిష్టులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్థలు, సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్థి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల.
- పి వి కె ప్రసాదరావు
బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి భోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, నరసింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది. శతకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపకశక్తి, ధారాశుద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభావము, దైవ చింతన వృద్ధి పొందుతాయి. సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, సంస్కృతీ సంప్రదాయ నిష్టులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్థలు, సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్థి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల. - పి వి కె ప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.