శ్రీ గురువాయూరు కృష్ణునకు అంకితముగా శ్రీ నారాయణ భట్టపాదులచే సంస్కృతమున రచింపబడిన శ్రీమద్ భాగవత సంగ్రహమే ఈ శ్రీమన్నారయణీయ కావ్యము. ఉపాసకులకు ఇహపర సుఖసాధకమై సకల దుఖములను, సకల వ్యాధులను నివారించుటలో భక్తులకు కొంగు బంగారము ఈ మహారచన. దీనిని మేము శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు రచించిన వివరణాత్మకమగు తెలుగు అనువాదముతో ఆంధ్ర భక్త మహాజనులకు అందజేయగలుగుచున్న౦దులకు ఎంతో సంతోషించుచున్నాము.
ఈ శ్రీమన్నారాయణీయము వ్యాసభగవద్విరచితమగు శ్రీమద్భాగవతమునకు సంక్షిప్తరూపమగు శ్రీమన్నారాయణ స్తవము. ఈ గ్రంథము దశకములుగా విభజించబడిన నూరు పదేసి శ్లోకములు సముదాయముగా ఉన్నది. కొన్ని దశకములలో పదింటికి మించిన శ్లోకములు ఉండుటతో ఇందలి మొత్తము శ్లోకములు 1036. ప్రతి దశకమునకు చివరి శ్లోకము గురువాయూరి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఉపాసక భక్త కవి తన వ్యాధులను నివారించుమని చేయు ప్రార్థనతో ముగియును.
ఈ గ్రంథము శ్రీమన్నారాయణుని వర్ణించునదియు స్తుతి౦చునదియు అగుటచేతను నారాయణ భట్టపాదులచే రచింపబడుటచేతను ఇట్లు రెండు హేతువులచే 'నారాయణీయము' అనబడుచున్నది. అని కవియే 100వ దశకమున 11వ శ్లోకమున చెప్పియున్నారు.
శ్రీ గురువాయూరు కృష్ణునకు అంకితముగా శ్రీ నారాయణ భట్టపాదులచే సంస్కృతమున రచింపబడిన శ్రీమద్ భాగవత సంగ్రహమే ఈ శ్రీమన్నారయణీయ కావ్యము. ఉపాసకులకు ఇహపర సుఖసాధకమై సకల దుఖములను, సకల వ్యాధులను నివారించుటలో భక్తులకు కొంగు బంగారము ఈ మహారచన. దీనిని మేము శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు రచించిన వివరణాత్మకమగు తెలుగు అనువాదముతో ఆంధ్ర భక్త మహాజనులకు అందజేయగలుగుచున్న౦దులకు ఎంతో సంతోషించుచున్నాము. ఈ శ్రీమన్నారాయణీయము వ్యాసభగవద్విరచితమగు శ్రీమద్భాగవతమునకు సంక్షిప్తరూపమగు శ్రీమన్నారాయణ స్తవము. ఈ గ్రంథము దశకములుగా విభజించబడిన నూరు పదేసి శ్లోకములు సముదాయముగా ఉన్నది. కొన్ని దశకములలో పదింటికి మించిన శ్లోకములు ఉండుటతో ఇందలి మొత్తము శ్లోకములు 1036. ప్రతి దశకమునకు చివరి శ్లోకము గురువాయూరి శ్రీకృష్ణుని ఉద్దేశించి ఉపాసక భక్త కవి తన వ్యాధులను నివారించుమని చేయు ప్రార్థనతో ముగియును. ఈ గ్రంథము శ్రీమన్నారాయణుని వర్ణించునదియు స్తుతి౦చునదియు అగుటచేతను నారాయణ భట్టపాదులచే రచింపబడుటచేతను ఇట్లు రెండు హేతువులచే 'నారాయణీయము' అనబడుచున్నది. అని కవియే 100వ దశకమున 11వ శ్లోకమున చెప్పియున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.