సృష్టి అనంతము. అనంతమైన సృష్టిలో అనంతకోటి నిగూఢ రహస్యములు ఈ రహస్యములు వేదములు. వేదాలలో నిగూఢంగా ఉన్న జ్ఞానసంపద పురాణాలలో కథల రూపంగా వ్యాఖ్యానింపబడినది. చతుర్థశ విద్యలలో లెక్కింపబడిన ఇవి పుట్టుకతో అనిర్వచనములు అయినప్పటికీ మిక్కిలి పురాతనములైన చాలా విషయాలు వీటిలో వర్ణించుట చేత పురాణములైనవి భారతం ఆదిపర్వంలోని ప్రధానశ్వాసము నందలి 204 వ శ్లోకం వేదాలు అర్థము చేసుకోవలెనంటే ఇతిహాస, పురాణముల యొక్క జ్ఞానం తప్పనిసరి అని తెలుపుచున్నది.
ఇతిహాస పురానాభ్యాం వేదం సముప బృహంక్రాత్
భిభిత్యతృశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి
ఇతిహాస, పురాణ జ్ఞానములను జోడించి , వేదార్థములను నిర్ణయించాలి. ఆ పురాణ, ఇతిహాసముల జ్ఞానంలేనివారు ఉన్న అపార్థ కల్పనతో ప్రహరించగలరని వేదమాత భయపడుతుంది. అందువల్ల పై శ్లోకం పురాణాల గొప్పతనాన్ని తెలుపుతుంది. అయితే ఈ పురాణాలు ఎప్పుడు ఆవిర్భవించినవి? ఎవరు వీటికర్త? అను విషయములమీద అనేక వాదములున్నవి. వేదకాలమునకు, కావ్యయుగమునకు మధ్య ఈ పురాణములు పుట్టినట్లుగా తెలియుచున్నది.
సృష్టి అనంతము. అనంతమైన సృష్టిలో అనంతకోటి నిగూఢ రహస్యములు ఈ రహస్యములు వేదములు. వేదాలలో నిగూఢంగా ఉన్న జ్ఞానసంపద పురాణాలలో కథల రూపంగా వ్యాఖ్యానింపబడినది. చతుర్థశ విద్యలలో లెక్కింపబడిన ఇవి పుట్టుకతో అనిర్వచనములు అయినప్పటికీ మిక్కిలి పురాతనములైన చాలా విషయాలు వీటిలో వర్ణించుట చేత పురాణములైనవి భారతం ఆదిపర్వంలోని ప్రధానశ్వాసము నందలి 204 వ శ్లోకం వేదాలు అర్థము చేసుకోవలెనంటే ఇతిహాస, పురాణముల యొక్క జ్ఞానం తప్పనిసరి అని తెలుపుచున్నది. ఇతిహాస పురానాభ్యాం వేదం సముప బృహంక్రాత్ భిభిత్యతృశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ఇతిహాస, పురాణ జ్ఞానములను జోడించి , వేదార్థములను నిర్ణయించాలి. ఆ పురాణ, ఇతిహాసముల జ్ఞానంలేనివారు ఉన్న అపార్థ కల్పనతో ప్రహరించగలరని వేదమాత భయపడుతుంది. అందువల్ల పై శ్లోకం పురాణాల గొప్పతనాన్ని తెలుపుతుంది. అయితే ఈ పురాణాలు ఎప్పుడు ఆవిర్భవించినవి? ఎవరు వీటికర్త? అను విషయములమీద అనేక వాదములున్నవి. వేదకాలమునకు, కావ్యయుగమునకు మధ్య ఈ పురాణములు పుట్టినట్లుగా తెలియుచున్నది.© 2017,www.logili.com All Rights Reserved.