ఆంధ్రుల అభిమాన గాయకుడు, స్వరకర్త అయిన ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తెలుగు లలిత సంగీతానికి ఒరవడి దిద్దిన మహనీయులలో ఒకరు. చలన చిత్రాలలో నేపధ్య గాయకుడిగా మాత్రమే ఉండిపోక దేశంలో ఏ ఉద్యమం వచ్చినా, ఏ సంఘటన జరిగినా స్పందించి పాటలు పాడి రికార్డుగా వెలువరించారు. పుష్ప విలాపం, కుంతీకుమారి మొదలైన కరుణశ్రీ పద్యాలను లలితంగాను, భావయుక్తంగాను, పాడడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా సత్కారాన్ని అందుకున్న ధన్యజీవి. రేడియోలోనూ, అనేక చోట్ల అనేక సంగీత కచేరీలు చేస్తూ సంగీతానికి కొత్త ఒరవడి సృష్టించిన మహామనిషి ఘంటసాల గారు. శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రంలో "శేషశైలా వాస శ్రీ వేంకటేశా" పాటను తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎదుట పాడిన దృశ్యం అద్భుతం. సంగీత దర్శకుడిగా, నేపధ్య గాయకునిగా ఆయన కృషి మరువలేనిది. స్వర్గసీమలో మొదటిసారి నేపధ్యగాయకునిగా భానుమతిగారితో పాడిన ఘంటసాలగారు చివరి దిశలో అనగా 1973లో భక్త తుకారం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులలో పాడిన తరువాత భగవద్గీత పాడిన తర్వాత ఆయన విష్ణు సాయుర్ధ్యాన్ని పొందినారు. అనేక అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఆయన సంగీత స్థితిని కొలిచేవారుగాని, అంతటి గాత్రముగాని నేటివారిలో లేదంటే అతిశయోక్తి కాదేమో!
- శ్రీలొల్ల రామచంద్రరావు
ఆంధ్రుల అభిమాన గాయకుడు, స్వరకర్త అయిన ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తెలుగు లలిత సంగీతానికి ఒరవడి దిద్దిన మహనీయులలో ఒకరు. చలన చిత్రాలలో నేపధ్య గాయకుడిగా మాత్రమే ఉండిపోక దేశంలో ఏ ఉద్యమం వచ్చినా, ఏ సంఘటన జరిగినా స్పందించి పాటలు పాడి రికార్డుగా వెలువరించారు. పుష్ప విలాపం, కుంతీకుమారి మొదలైన కరుణశ్రీ పద్యాలను లలితంగాను, భావయుక్తంగాను, పాడడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా సత్కారాన్ని అందుకున్న ధన్యజీవి. రేడియోలోనూ, అనేక చోట్ల అనేక సంగీత కచేరీలు చేస్తూ సంగీతానికి కొత్త ఒరవడి సృష్టించిన మహామనిషి ఘంటసాల గారు. శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రంలో "శేషశైలా వాస శ్రీ వేంకటేశా" పాటను తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎదుట పాడిన దృశ్యం అద్భుతం. సంగీత దర్శకుడిగా, నేపధ్య గాయకునిగా ఆయన కృషి మరువలేనిది. స్వర్గసీమలో మొదటిసారి నేపధ్యగాయకునిగా భానుమతిగారితో పాడిన ఘంటసాలగారు చివరి దిశలో అనగా 1973లో భక్త తుకారం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులలో పాడిన తరువాత భగవద్గీత పాడిన తర్వాత ఆయన విష్ణు సాయుర్ధ్యాన్ని పొందినారు. అనేక అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఆయన సంగీత స్థితిని కొలిచేవారుగాని, అంతటి గాత్రముగాని నేటివారిలో లేదంటే అతిశయోక్తి కాదేమో! - శ్రీలొల్ల రామచంద్రరావు
© 2017,www.logili.com All Rights Reserved.