శ్రీలలితార్పణంగా...శ్రీలలితాదేవీ దివ్యలీలామృతాన్ని ప్రవచనరూపంగా పలుతావుల్లో కీర్తించే భాగ్యం శ్రీమాతృకటాక్షం వలన, గురుకృప వలన లభించింది. ప్రవచనరూపంగా వచ్చిన ఆ దివ్యగాథలను పుస్తకరూపంలో తీసుకురావాలని బహుకాలం నుండి ఆశయం.
బ్రహ్మాండపురాణాంతర్గతమైన లలితోపాఖ్యానంలోని ఘట్టాలను పూర్వాపర పరిశీలనతో సమన్వయిస్తూ ప్రవచించడం జరిగింది. ఆయా సన్నివేశాలను, అసురగణ సంహారానికై అమ్మ నుండి ఆవిర్భవించిన దేవీ రూపాలను ఉపాసనాపరంగా, తత్త్వపరంగా వ్యాఖ్యానిం చడం ఈ గ్రంథ ప్రత్యేకత. కేవలం పురాణకథగా కాక ఒక తత్త్వప్రతిపాదనగా లలితా చరితను సంభావిస్తూ ప్రసంగించిన విషయాలనే గ్రంథంలో పొందుపరచడమయ్యింది.
ఈ గ్రంథ చతుర్ధ ముద్రణకు సమర్పకులైన శ్రీమతి ఉపద్రష్ట/భమిడి మాధవి, యు.ఎస్.ఎ. వారికి అమ్మవారి కృపాకటాక్షాలను ఆకాంక్షిస్తున్నాను. గౌరీశంకర స్వరూపులైన మాతాపితరులు రమణమ్మ,రామమూర్తి శర్మగార్ల దీవెనలు, గురువర్యులు శ్రీ మహాదేవానందనాథుల అనుగ్రహబలం ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దినవి.
నా సర్వ వాజ్మయం వలె ఈ గ్రంథము కూడా గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.
శ్రీలలితార్పణంగా...శ్రీలలితాదేవీ దివ్యలీలామృతాన్ని ప్రవచనరూపంగా పలుతావుల్లో కీర్తించే భాగ్యం శ్రీమాతృకటాక్షం వలన, గురుకృప వలన లభించింది. ప్రవచనరూపంగా వచ్చిన ఆ దివ్యగాథలను పుస్తకరూపంలో తీసుకురావాలని బహుకాలం నుండి ఆశయం. బ్రహ్మాండపురాణాంతర్గతమైన లలితోపాఖ్యానంలోని ఘట్టాలను పూర్వాపర పరిశీలనతో సమన్వయిస్తూ ప్రవచించడం జరిగింది. ఆయా సన్నివేశాలను, అసురగణ సంహారానికై అమ్మ నుండి ఆవిర్భవించిన దేవీ రూపాలను ఉపాసనాపరంగా, తత్త్వపరంగా వ్యాఖ్యానిం చడం ఈ గ్రంథ ప్రత్యేకత. కేవలం పురాణకథగా కాక ఒక తత్త్వప్రతిపాదనగా లలితా చరితను సంభావిస్తూ ప్రసంగించిన విషయాలనే గ్రంథంలో పొందుపరచడమయ్యింది. ఈ గ్రంథ చతుర్ధ ముద్రణకు సమర్పకులైన శ్రీమతి ఉపద్రష్ట/భమిడి మాధవి, యు.ఎస్.ఎ. వారికి అమ్మవారి కృపాకటాక్షాలను ఆకాంక్షిస్తున్నాను. గౌరీశంకర స్వరూపులైన మాతాపితరులు రమణమ్మ,రామమూర్తి శర్మగార్ల దీవెనలు, గురువర్యులు శ్రీ మహాదేవానందనాథుల అనుగ్రహబలం ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దినవి. నా సర్వ వాజ్మయం వలె ఈ గ్రంథము కూడా గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.
© 2017,www.logili.com All Rights Reserved.