శ్రీరుద్ర నమక వైభవమ్శివార్పణమ్ సుప్రసిద్ధమైన శ్రీరుద్రనమక మంత్రరాశికి సంప్రదాయ సిద్ధంగా బహు భాష్యాలున్నాయి.తెలుగులో అవి లభ్యమౌ తున్నాయి కూడా. ఎన్నో భాష్య గ్రంథాలుండగా మళ్ళీ ఈ గ్రంథం దేనికి? ఇది అటువంటి గ్రంథాల కోవలోనిదికాదు కనుక. ?
సుమారు పన్నెండేళ్ళ నుండి అనేక పర్యాయాలు, అనేక ప్రాంతాలలో 'శ్రీ రుద్రభాష్యం' పై ప్రవచనాలు చేసే భాగ్యంనాకులభించింది. తత్పూర్వమే - ఈ భాష్యాలను అధ్యయనం చేస్తూ శివానుభవంతో మనసు పారవశ్యమయింది. అంతేకాక -2001లో 'ఈటీవీ' లో ప్రతి మంత్రాన్ని విస్తారంగా విశదపరుస్తూ, బహుభాష్య సమన్వయంతో ప్రసంగించే అవకాశం కూడా లభించింది.
కాశీక్షేత్రంలోపదకొండురోజులపాటుదీక్షగాభాష్యోపన్యాసధారతోశివార్చనచేసుకొనేధన్యతను కూడాపొందాను.
నాచేత 2010లో బెంగళూరులో 'శ్రీరుద్రభాష్యోపన్యాసాలను' ఏర్పాటు చేసినప్పుడు,దానిని గ్రంథస్థం చేయాలనేసత్సంకల్పం ఆత్మీయులు శ్రీ వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారికి కలిగింది. నా ప్రవచనాలను శ్రద్ధగావింటూ హృదయస్థంచేసుకొనేఅల వాటున్నశ్రీమతి లక్ష్మిగారు (నెల్లూరు) ఈ బాధ్యతను స్వీకరించి, నిష్ఠతో ధ్వనిముద్రణలను వింటూమొత్తాన్నిపుస్తకంగావ్రాశారు- ఉపన్యాసాన్ని యథాతథంగా.
ప్రవచన ధోరణిలోనే రచనను నిబద్ధం చేయాలని ఎంతగా అనుకున్నా, ప్రసంగించే పద్ధతికీ, రచించే పద్ధతికీ కొన్నిమార్పులు అవసర మనిపించింది. దానితో అటు ఉపన్యాస వైఖరినీ, గ్రంథ విధానాన్ని మేళవిస్తూ, తగిన పరిష్కరణలు చేసి ఈరూపాన్ని సంతరించడం జరిగింది.
శ్రీరుద్ర నమక వైభవమ్శివార్పణమ్ సుప్రసిద్ధమైన శ్రీరుద్రనమక మంత్రరాశికి సంప్రదాయ సిద్ధంగా బహు భాష్యాలున్నాయి.తెలుగులో అవి లభ్యమౌ తున్నాయి కూడా. ఎన్నో భాష్య గ్రంథాలుండగా మళ్ళీ ఈ గ్రంథం దేనికి? ఇది అటువంటి గ్రంథాల కోవలోనిదికాదు కనుక. ? సుమారు పన్నెండేళ్ళ నుండి అనేక పర్యాయాలు, అనేక ప్రాంతాలలో 'శ్రీ రుద్రభాష్యం' పై ప్రవచనాలు చేసే భాగ్యంనాకులభించింది. తత్పూర్వమే - ఈ భాష్యాలను అధ్యయనం చేస్తూ శివానుభవంతో మనసు పారవశ్యమయింది. అంతేకాక -2001లో 'ఈటీవీ' లో ప్రతి మంత్రాన్ని విస్తారంగా విశదపరుస్తూ, బహుభాష్య సమన్వయంతో ప్రసంగించే అవకాశం కూడా లభించింది. కాశీక్షేత్రంలోపదకొండురోజులపాటుదీక్షగాభాష్యోపన్యాసధారతోశివార్చనచేసుకొనేధన్యతను కూడాపొందాను. నాచేత 2010లో బెంగళూరులో 'శ్రీరుద్రభాష్యోపన్యాసాలను' ఏర్పాటు చేసినప్పుడు,దానిని గ్రంథస్థం చేయాలనేసత్సంకల్పం ఆత్మీయులు శ్రీ వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారికి కలిగింది. నా ప్రవచనాలను శ్రద్ధగావింటూ హృదయస్థంచేసుకొనేఅల వాటున్నశ్రీమతి లక్ష్మిగారు (నెల్లూరు) ఈ బాధ్యతను స్వీకరించి, నిష్ఠతో ధ్వనిముద్రణలను వింటూమొత్తాన్నిపుస్తకంగావ్రాశారు- ఉపన్యాసాన్ని యథాతథంగా. ప్రవచన ధోరణిలోనే రచనను నిబద్ధం చేయాలని ఎంతగా అనుకున్నా, ప్రసంగించే పద్ధతికీ, రచించే పద్ధతికీ కొన్నిమార్పులు అవసర మనిపించింది. దానితో అటు ఉపన్యాస వైఖరినీ, గ్రంథ విధానాన్ని మేళవిస్తూ, తగిన పరిష్కరణలు చేసి ఈరూపాన్ని సంతరించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.