ఈ గ్రంథము శ్రీకృష్ణకర్ణామృతము రచింపబడిన పిమ్మటనే శ్రీరామ భక్తుడైన యొక కవి తాను కొన్ని శ్లోకములు రచించియు, కొన్నింటిని ఇతరుల గ్రంధములనుండి గ్రహించియు ఈ గ్రంధమును సమకూర్చియున్నాడనుట ఏవిధమైన సంశయములేదు. ఇది శ్రీరామభక్తులకెంతేని సంతోషము కలిగించు గ్రంథమనక తప్పదు. దీని నిదివరలో కొందరు ముద్రించియున్నారు. ప్రకృతమేతద్గ్రంథ ప్రకాశకులగు మహారాజశ్రీ ఏ కణ్ణన్ శెట్టిగారు సంస్కృతశ్లోకములకు తాత్పర్యమును వ్రాసి యిమ్మని నన్నుకోరుటచే యధా మలి వ్రాసియిచ్చితిని. వెనుకటి ముద్రణములలోనితప్పులను ఎన్నింటినో దిద్దియున్నాను. ఇంకను కొన్ని యుండవచ్చును. శుద్ధమైన ప్రత్యంతరము లభింపని కారణమున నవి దిద్దజాలని నాలోపమును మన్నింపవేడు చున్నాను. ఇదివరలో ముద్రితములయిన పుస్తకముకన్న నిది ఎన్నో రెట్లు మిన్న అని చదువరులెరుగ గలరని విన్నవించుచున్నాను.
- పురాణం సూర్యనారాయణతీర్థులు
ఈ గ్రంథము శ్రీకృష్ణకర్ణామృతము రచింపబడిన పిమ్మటనే శ్రీరామ భక్తుడైన యొక కవి తాను కొన్ని శ్లోకములు రచించియు, కొన్నింటిని ఇతరుల గ్రంధములనుండి గ్రహించియు ఈ గ్రంధమును సమకూర్చియున్నాడనుట ఏవిధమైన సంశయములేదు. ఇది శ్రీరామభక్తులకెంతేని సంతోషము కలిగించు గ్రంథమనక తప్పదు. దీని నిదివరలో కొందరు ముద్రించియున్నారు. ప్రకృతమేతద్గ్రంథ ప్రకాశకులగు మహారాజశ్రీ ఏ కణ్ణన్ శెట్టిగారు సంస్కృతశ్లోకములకు తాత్పర్యమును వ్రాసి యిమ్మని నన్నుకోరుటచే యధా మలి వ్రాసియిచ్చితిని. వెనుకటి ముద్రణములలోనితప్పులను ఎన్నింటినో దిద్దియున్నాను. ఇంకను కొన్ని యుండవచ్చును. శుద్ధమైన ప్రత్యంతరము లభింపని కారణమున నవి దిద్దజాలని నాలోపమును మన్నింపవేడు చున్నాను. ఇదివరలో ముద్రితములయిన పుస్తకముకన్న నిది ఎన్నో రెట్లు మిన్న అని చదువరులెరుగ గలరని విన్నవించుచున్నాను. - పురాణం సూర్యనారాయణతీర్థులు© 2017,www.logili.com All Rights Reserved.