దేవర్షియైన నారదుని నుండి శ్రీరాముని గుణగణాలను విని, పిదప చతుర్ముఖుడాదేశించగా శ్రీమద్వాల్మీకి మునివర్యుడు శ్రీరామ చరితాన్ని అత్యద్భుత మహాకావ్యమైన శ్రీమద్రామాయణంలో ఉపనిబద్ధం చేసినది మొదలు శ్రీరామచరితం వివిధ భాషలలో, అనేక రూపాలలో ఎందరో మహాకవుల చేత, భక్త అగ్రగణ్యుల చేత సంద్రుబ్ధమై అన్ని దేశాలను పవిత్రం చేసింది, చేస్తూన్నది. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సంస్కృతంలోనే ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, భుసుండి రామాయణం, ఆశ్చర్య రామాయణం మొదలైన 'రామాయణ' నామ సమంచితాలైన గ్రంథాలు, ఎన్నో కావ్య నాటకాదులు వెలువడ్డాయి. భారతదేశంలోనూ ఇతర దేశభాషల లోనూ వివిధ సారస్వత ప్రక్రియలలో ఆవిర్భవించిన శ్రీరామకథా సంబద్ధ గ్రంథాల సంఖ్య అనంతం.
దేవర్షియైన నారదుని నుండి శ్రీరాముని గుణగణాలను విని, పిదప చతుర్ముఖుడాదేశించగా శ్రీమద్వాల్మీకి మునివర్యుడు శ్రీరామ చరితాన్ని అత్యద్భుత మహాకావ్యమైన శ్రీమద్రామాయణంలో ఉపనిబద్ధం చేసినది మొదలు శ్రీరామచరితం వివిధ భాషలలో, అనేక రూపాలలో ఎందరో మహాకవుల చేత, భక్త అగ్రగణ్యుల చేత సంద్రుబ్ధమై అన్ని దేశాలను పవిత్రం చేసింది, చేస్తూన్నది. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సంస్కృతంలోనే ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, భుసుండి రామాయణం, ఆశ్చర్య రామాయణం మొదలైన 'రామాయణ' నామ సమంచితాలైన గ్రంథాలు, ఎన్నో కావ్య నాటకాదులు వెలువడ్డాయి. భారతదేశంలోనూ ఇతర దేశభాషల లోనూ వివిధ సారస్వత ప్రక్రియలలో ఆవిర్భవించిన శ్రీరామకథా సంబద్ధ గ్రంథాల సంఖ్య అనంతం.© 2017,www.logili.com All Rights Reserved.