సుమారు ఏడెనిమిదేళ్ళ క్రిందట నేను శ్రీమాన్ కె. వి. రాఘవాచార్యుల వారు నారాయణ శతకానికి వ్రాసిన రాఘవీయవ్యాఖ్యానాన్ని ప్రత్యక్షరశోధనపూర్వకంగా పరిశీలించాను. ఆ పఠన సందర్భంలో వారిని దర్శించుకోవాలని గట్టి కోరిక కలిగింది. శ్రీ పావని సేవాసమితి వారు ప్రచురించిన శతకాలన్నింటినీ నేను పరిష్కరించవలసి వచ్చింది. అప్పుడే ఆ శతకాన్ని గూడ అనుశీలించాను. రాఘవీయవ్యాఖ్యానం నాకు ఎంతగానో నచ్చింది. రాఘవీయ వ్యాఖ్యానం చదివిన వారికి తాత్త్వికమైన సర్వాంశాల పరిజ్ఞానం సమగ్రంగా కలుగుతుంది.
తరువాత భాగ్యనగరంలో కొంతకాలం క్రిందట నేను శ్రీవారిని దర్శించుకున్నాను. వారితో కొంతసేపు సంభాషించాను.
- కె. వి. రాఘవాచార్యులు