సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞాని, దేశకాల వస్తువులన్నిటికీ అతీతంగా ఉండేవాడు. సర్వత్రా వ్యాపించినవాడు నిత్యముక్తుడు, సాటిలేని గొప్పదనం కలిగినవాడు పరమాత్మ. అలాంటి పరమాత్ముణ్ణి గురించి చెప్పాలని వేదాల్ని లక్షలాది అనువాకాలు ప్రయత్నించినా పూర్తిగా ఆయన స్వరూపాన్ని వర్ణించలేకపోయాయి. మహాయోగులు కూడా ఎంతోకాలం కఠినమైన తపస్సు చేసి గానీ, ఆ పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకొని పరమపురుషార్తమైన మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఇలా ఎంతో గొప్పవాడుగా చెప్పబడ్డ ఆ పరబ్రహ్మ భూలోకంలోని గురువాయూరు క్షేత్రంలో సగునుడుగా ఆకారాన్ని ధరించి ' నారాయణుడు' అనే పేరుతో విరజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ గురువాయూరు వాసులు ఎంత భాగ్యవంతులో కదా!
సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞాని, దేశకాల వస్తువులన్నిటికీ అతీతంగా ఉండేవాడు. సర్వత్రా వ్యాపించినవాడు నిత్యముక్తుడు, సాటిలేని గొప్పదనం కలిగినవాడు పరమాత్మ. అలాంటి పరమాత్ముణ్ణి గురించి చెప్పాలని వేదాల్ని లక్షలాది అనువాకాలు ప్రయత్నించినా పూర్తిగా ఆయన స్వరూపాన్ని వర్ణించలేకపోయాయి. మహాయోగులు కూడా ఎంతోకాలం కఠినమైన తపస్సు చేసి గానీ, ఆ పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకొని పరమపురుషార్తమైన మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఇలా ఎంతో గొప్పవాడుగా చెప్పబడ్డ ఆ పరబ్రహ్మ భూలోకంలోని గురువాయూరు క్షేత్రంలో సగునుడుగా ఆకారాన్ని ధరించి ' నారాయణుడు' అనే పేరుతో విరజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ గురువాయూరు వాసులు ఎంత భాగ్యవంతులో కదా!© 2017,www.logili.com All Rights Reserved.