నారాయణ గారు నిత్యం ప్రజా ఉద్యమాల వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయన తాను ఎంచుకున్న ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ రాసిన రాతలే ఈ పుస్తకం. ఈ ఉద్యమకారుని డైరీ కొత్త ఆలోచనలకూ పదును పెడుతుంది. నడుస్తున్న చరిత్రపై నారాయణ ఎక్కుపెట్టిన ఆలోచనల అస్త్రాలే ఈ పుస్తకం. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసంలో ఒక క్రొత్త దృక్కోణం కనిపిస్తుంది.
కాలచక్రానికి ఈ వ్యాసాలు అద్దం పడుతున్నాయి. సమాజంలో వచ్చే మార్పులను పరిశిలించడానికి ఇదొక దుర్భిణిగా కనిపిస్తుంది. ఆకలైనప్పుడు గటక తాగుతుంటే ఏ రుచి కలుగుతుందో అలాగే ఈ పుస్తకం చదువుతుంటే ఆలోచనల ఆకలి తీరినట్లు అవుతుంది.
ఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతుంటే గులక రాళ్ళపై నడిచినట్లు ఉంటుంది. గులకరాళ్ళు పాదాలకు తగులుతుంటే శరీరంలోని ప్రతి అణువులో ఏ కదలికలు వచ్చి రక్త ప్రసరణ జరుగుతుందో ఈ వ్యాసాలు చదువుతుంటే శ్రమ సంస్కృతికి కొత్త ఆలోచనలకూ కదలిక వచ్చినట్లుగా ఉంటుంది.
-డా.కె.నారాయణ వ్యాసాలు.
నారాయణ గారు నిత్యం ప్రజా ఉద్యమాల వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయన తాను ఎంచుకున్న ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ రాసిన రాతలే ఈ పుస్తకం. ఈ ఉద్యమకారుని డైరీ కొత్త ఆలోచనలకూ పదును పెడుతుంది. నడుస్తున్న చరిత్రపై నారాయణ ఎక్కుపెట్టిన ఆలోచనల అస్త్రాలే ఈ పుస్తకం. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసంలో ఒక క్రొత్త దృక్కోణం కనిపిస్తుంది. కాలచక్రానికి ఈ వ్యాసాలు అద్దం పడుతున్నాయి. సమాజంలో వచ్చే మార్పులను పరిశిలించడానికి ఇదొక దుర్భిణిగా కనిపిస్తుంది. ఆకలైనప్పుడు గటక తాగుతుంటే ఏ రుచి కలుగుతుందో అలాగే ఈ పుస్తకం చదువుతుంటే ఆలోచనల ఆకలి తీరినట్లు అవుతుంది. ఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతుంటే గులక రాళ్ళపై నడిచినట్లు ఉంటుంది. గులకరాళ్ళు పాదాలకు తగులుతుంటే శరీరంలోని ప్రతి అణువులో ఏ కదలికలు వచ్చి రక్త ప్రసరణ జరుగుతుందో ఈ వ్యాసాలు చదువుతుంటే శ్రమ సంస్కృతికి కొత్త ఆలోచనలకూ కదలిక వచ్చినట్లుగా ఉంటుంది. -డా.కె.నారాయణ వ్యాసాలు.
© 2017,www.logili.com All Rights Reserved.