కవి ఆలోచనల్ని అనుభవించి పలవరించడానికి ఇతరాత్ర సాధన సంపత్తి అవసరమా? ఏ విధమైన ఆసరా లేకుండా గరిమెళ్ళ నారాయణ కవితల్ని ఆస్వాదించవచ్చు. ఆహ్లాదంగా నిర్మలమైన నదిలోంచి కదలాడే అలల్లా మనల్ని తాకుతాయి. సంక్లిష్టతకు తావులేదు. సరళంగా అలవోకగా గొప్ప భావాన్ని సైతం కవితానిర్మాణ చట్రంలో ఇమడ్చగల నేర్పు నారాయణకు ఉంది. కవిత రూపుదిద్దుకునే క్రమంలో ఒక నిశ్చింత వల్ల ఇది సాధ్యమైంది. అలాగే కొంతమందికి ప్రాపంచక దృష్టి ఎక్కువగా ఉంటుంది. తనలో తానూ చిట్లినప్పుడు వ్యంగ్యంగానైనా సారాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు. అలాంటి కవి నారాయణ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళనుంచో కొట్టుకుపోకుండా పరిణామాల్ని నిశితంగా పరిశీలించడం కూడా ఈ కవికి తెలుసు.
ఇందులో...
జరుపుకోవలసిన పండగల ప్రయాణమే జీవితం
ఊహించడానికేం ఖర్చు కాదులే!
మాతృ గ్రహమే మానవతా గ్రహం కూడా!
మనిషంటే... మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం
కవి ఆలోచనల్ని అనుభవించి పలవరించడానికి ఇతరాత్ర సాధన సంపత్తి అవసరమా? ఏ విధమైన ఆసరా లేకుండా గరిమెళ్ళ నారాయణ కవితల్ని ఆస్వాదించవచ్చు. ఆహ్లాదంగా నిర్మలమైన నదిలోంచి కదలాడే అలల్లా మనల్ని తాకుతాయి. సంక్లిష్టతకు తావులేదు. సరళంగా అలవోకగా గొప్ప భావాన్ని సైతం కవితానిర్మాణ చట్రంలో ఇమడ్చగల నేర్పు నారాయణకు ఉంది. కవిత రూపుదిద్దుకునే క్రమంలో ఒక నిశ్చింత వల్ల ఇది సాధ్యమైంది. అలాగే కొంతమందికి ప్రాపంచక దృష్టి ఎక్కువగా ఉంటుంది. తనలో తానూ చిట్లినప్పుడు వ్యంగ్యంగానైనా సారాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు. అలాంటి కవి నారాయణ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళనుంచో కొట్టుకుపోకుండా పరిణామాల్ని నిశితంగా పరిశీలించడం కూడా ఈ కవికి తెలుసు. ఇందులో... జరుపుకోవలసిన పండగల ప్రయాణమే జీవితం ఊహించడానికేం ఖర్చు కాదులే! మాతృ గ్రహమే మానవతా గ్రహం కూడా! మనిషంటే... మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం© 2017,www.logili.com All Rights Reserved.