మనదేశంలో అంటరానితనం ఉనికిలో ఉన్న విషయం విదేశీయులకు తెలుసు. కాని అది ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వారు మన పొరుగున లేరు. అంటరానితనం ఎంత దుర్భరమో వారు అర్థం చేసుకోలేరు. హిందువులు పెద్ద సంఖ్యలో నివసించే ఊళ్లకు వెలుపల బతకడం, ప్రతిరోజు ఊర్లోని అశుద్దాలను మోసుకెళ్లడం, ఇంటి ద్వారాల ముందు ఉంచిన ఆహారాన్ని తెచ్చుకోవడం, హిందూ వైశ్యుల అంగళ్లకు దూరంగా నిలబడి సరుకులను కొనుక్కోవడం, ఊళ్లోని ప్రతి ఇంటిని తనదిగా భావించి సేవలు చేసినా ఎవరినీ తాకడానికి వీల్లేదు. అంటరానివారు ఉన్నత కులాల చేత ఎలా వేదన చెందాల్సి వస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. సాధారణ స్థితిని వివరించడం లేదా ఆ దుర్మార్గాలకు సంబంధించిన ఘటనలను వారి ముందుంచడం అనే రెండు పద్ధతుల ద్వారా మన లక్ష్యాన్ని సాధించగలం. మొదటి పద్దతి కంటే రెండవది సమర్ధమైందని భావిస్తాను. ఈ పరిస్థితులను తెలియచెప్పడానికి నా అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాలను కొన్ని, వివరిస్తాను. నా అనుభవాలతో మొదలెడతాను.
- డా|| బి.ఆర్. అంబేడ్కర్
మనదేశంలో అంటరానితనం ఉనికిలో ఉన్న విషయం విదేశీయులకు తెలుసు. కాని అది ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వారు మన పొరుగున లేరు. అంటరానితనం ఎంత దుర్భరమో వారు అర్థం చేసుకోలేరు. హిందువులు పెద్ద సంఖ్యలో నివసించే ఊళ్లకు వెలుపల బతకడం, ప్రతిరోజు ఊర్లోని అశుద్దాలను మోసుకెళ్లడం, ఇంటి ద్వారాల ముందు ఉంచిన ఆహారాన్ని తెచ్చుకోవడం, హిందూ వైశ్యుల అంగళ్లకు దూరంగా నిలబడి సరుకులను కొనుక్కోవడం, ఊళ్లోని ప్రతి ఇంటిని తనదిగా భావించి సేవలు చేసినా ఎవరినీ తాకడానికి వీల్లేదు. అంటరానివారు ఉన్నత కులాల చేత ఎలా వేదన చెందాల్సి వస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. సాధారణ స్థితిని వివరించడం లేదా ఆ దుర్మార్గాలకు సంబంధించిన ఘటనలను వారి ముందుంచడం అనే రెండు పద్ధతుల ద్వారా మన లక్ష్యాన్ని సాధించగలం. మొదటి పద్దతి కంటే రెండవది సమర్ధమైందని భావిస్తాను. ఈ పరిస్థితులను తెలియచెప్పడానికి నా అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాలను కొన్ని, వివరిస్తాను. నా అనుభవాలతో మొదలెడతాను. - డా|| బి.ఆర్. అంబేడ్కర్© 2017,www.logili.com All Rights Reserved.