రాజకీయాలు అనే కాటుక గదిలో ప్రవేశించి, ఏ విధమైన నల్లని మరకలూ అంచకుండా ధవళవస్త్రాలతో బయటకు వచ్చిన నిజాయితీపరుడు జోగయ్యగారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాలను క్రోడీకరించి 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్తానం' పేరుతో జోగయ్యగారు పుస్తకాన్ని వ్రాయడం సంతోషకరం. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత, రాజకీయ పంథాలను నిక్కచ్చిగా వివరించారు. అలాగే రాష్ట్రంలో సంభవించిన పలు రాజకీయ పరిణామాలలో తన పాత్ర గురించి స్పష్టంగా విశదీకరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తన అవగాహనను, రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై తనకున్న అంచనాలనూ తన పుస్తకంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం ఎంతో దోహదపడగలదని నా అభిప్రాయం.
- సత్యనారాయణరాజు
రాజకీయాలు అనే కాటుక గదిలో ప్రవేశించి, ఏ విధమైన నల్లని మరకలూ అంచకుండా ధవళవస్త్రాలతో బయటకు వచ్చిన నిజాయితీపరుడు జోగయ్యగారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాలను క్రోడీకరించి 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్తానం' పేరుతో జోగయ్యగారు పుస్తకాన్ని వ్రాయడం సంతోషకరం. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత, రాజకీయ పంథాలను నిక్కచ్చిగా వివరించారు. అలాగే రాష్ట్రంలో సంభవించిన పలు రాజకీయ పరిణామాలలో తన పాత్ర గురించి స్పష్టంగా విశదీకరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తన అవగాహనను, రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై తనకున్న అంచనాలనూ తన పుస్తకంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం ఎంతో దోహదపడగలదని నా అభిప్రాయం. - సత్యనారాయణరాజు© 2017,www.logili.com All Rights Reserved.