ఆ పాత కోటగోడల శిథిలాలనుండి నడుస్తున్నప్పుడు ఏదో ఉద్విగ్నత, ఏదో వ్యాకులత, ఏదో అవ్యక్తవేశం ఎందుకో పొంగి పొంగి పొర్లే దుఃఖం. అడుగుల కింది మట్టిలో ఏదో ఒక అశరీరజీవి కదులుతున్నట్టు మట్టిపొరల లోలోతుల్లో సమాధియైపోయిన మానవ చరిత్ర మళ్ళీ చేతులు చాచి బాహువుల్లోకి పిలుస్తున్నట్టు. ఎవరో తనకు తెలిసినవారే ఎవరో తనకు చెందినవాళ్ళే.. తనదే ఐన సంతతి నుండి ఏదో వినబడని పిలువు.. రాళ్ళు అవశేషాలు శిల్పాలు విరిగిపోయిన విగ్రహాలు పొందికగా కూర్చి కట్టిన పెద్దపెద్ద రాతి కట్టడాలు. వందల సంవత్సరాల తర్వాత కూడా నిన్ననే ఎవరో పాలిష్ చేసినట్టు ధగధగా మెరుస్తున్న గ్రానైట్ శిల్పాకృతులు. ఆ రాతి నగలు, నగిషీలు, శరీరభంగిమ. అసలా ఎత్తుపల్లాలను, వక్రరేఖా తలాలను అంతనున్నగా ఏకరీతిగా మెరుపు పెట్టగల సాంకేతిక పరిజ్ఞానం అప్పటి ఆ తరానికెక్కడిది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఆ పాత కోటగోడల శిథిలాలనుండి నడుస్తున్నప్పుడు ఏదో ఉద్విగ్నత, ఏదో వ్యాకులత, ఏదో అవ్యక్తవేశం ఎందుకో పొంగి పొంగి పొర్లే దుఃఖం. అడుగుల కింది మట్టిలో ఏదో ఒక అశరీరజీవి కదులుతున్నట్టు మట్టిపొరల లోలోతుల్లో సమాధియైపోయిన మానవ చరిత్ర మళ్ళీ చేతులు చాచి బాహువుల్లోకి పిలుస్తున్నట్టు. ఎవరో తనకు తెలిసినవారే ఎవరో తనకు చెందినవాళ్ళే.. తనదే ఐన సంతతి నుండి ఏదో వినబడని పిలువు.. రాళ్ళు అవశేషాలు శిల్పాలు విరిగిపోయిన విగ్రహాలు పొందికగా కూర్చి కట్టిన పెద్దపెద్ద రాతి కట్టడాలు. వందల సంవత్సరాల తర్వాత కూడా నిన్ననే ఎవరో పాలిష్ చేసినట్టు ధగధగా మెరుస్తున్న గ్రానైట్ శిల్పాకృతులు. ఆ రాతి నగలు, నగిషీలు, శరీరభంగిమ. అసలా ఎత్తుపల్లాలను, వక్రరేఖా తలాలను అంతనున్నగా ఏకరీతిగా మెరుపు పెట్టగల సాంకేతిక పరిజ్ఞానం అప్పటి ఆ తరానికెక్కడిది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.