'మంచి సినిమాలు రావడంలేదు.. అంతా చెత్త' అని విజ్ఞులైన ప్రేక్షకుల అసంతృప్త ప్రకటనలు... ' మీరు ఏవ్ చూస్తున్నారు కాబట్టి మేము అవే తీస్తున్నాం.. మంచి సినిమాలను చూస్తూ మీరు ఆదరిస్తే మేమెందుకు తీయం' అని అటునుండి ఒక ప్రతిస్పందన. ఈ స్థితికి జవాబే ఉండదు. సాహిత్య విషయంగా కూడా అంతే. పత్రికలు బట్టి అభూత కల్పనలతో కూడిన ఫాంటసీలూ, బూతులు, అడవులూ, రాజ్యాలు, క్రైమ్ త్రిల్లర్ లూ.... వీటినే ప్రచురిస్తున్నారు కాబట్టి మేము వీటిని కాక ఇంకేమి చదవాలి మరి.. అని కొందరు పాఠకులు.. పాఠకులు ఆ చచ్చు సాహిత్యానికే 'జై' అంటున్నారు కాబట్టి మరి మేము వాటినే సీరియల్లు గా ప్రచురిస్తున్నాం... అని సంపాదక మహాశయులు.. ఇది దీన పరిస్థితి.
ఏది మంచి సాహిత్యం.. అంటే.. ఇదమిద్ధంగా ఇదీ అని చెప్పలేముగాని, సమాజ హితాన్ని కోరేదేదైనా 'మంచి సాహిత్యమేనేమో' అని మాత్రం చెప్పొచ్చు. కనీసం వర్తమాన యువ తరాన్ని తప్పుతోవ పట్టించకుండా.... వీలుంటే సన్మార్గ దర్శనం చేయగలిగేదేదైనా సత్ సాహిత్యమే.
- రామా చంద్రమౌళి