తరతరాల చరిత్ర, సంస్కృతీ గల తెలుగుజాతి తన ప్రాచీనతను చాటుకుని మురిసిపోవడమే కాదు, ప్రపంచస్థాయిలో పలురంగాలలో విశిష్ఠమైన సేవలందించిన లబ్ధ ప్రతిష్టుల నెందరినో అందించింది. అందుకు తెలుగువారంతా సగర్వంగా తలెత్తుకోవడమే కాదు, తమ కీర్తిని శిఖరాయమానంగా చాటుకోవడానికి వీలు కల్పించింది. తెలుగు వెలుగులను నాలుగు చెరగుల విస్తరింపజేసిన తెలుగు మహనీయులెందరో ఉన్నారు. అటువంటి వారిలో వాగ్గేయకారుడు త్యాగయ్య, ఈనాటి విశ్వవిజ్ఞాని, మహావేదాంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివారు ఉన్నారు.
అదే విధంగా పలురంగాలలో విశేషమైన కృషి జరిపి యావత్ ప్రపంచ దృష్టిని తమ వైపు ఆకర్షింపజేసుకున్న విద్యావేత్తలు, మహామేధావులు ఆర్కాటు సోదరులు. కవలలైన వీరు రామస్వామి మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ పేర్లతో ఆర్కాట్ సోదరులుగా గుర్తింపు పొందారు. వీరు కర్నూలులో జన్మించి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా పరిక్రమించి గణనీయమైన పేరు గడించారు. అన్ని తరాలవారు స్మరించుకోవలసిన వీరిని గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. అందుకే ఆ కవలల జీవితసంగ్రహాన్ని ఈ లఘు గ్రంథ రూపంలో అందించాలని సంకల్పించి ఈ ప్రయత్నాన్ని చేశాము.
తరతరాల చరిత్ర, సంస్కృతీ గల తెలుగుజాతి తన ప్రాచీనతను చాటుకుని మురిసిపోవడమే కాదు, ప్రపంచస్థాయిలో పలురంగాలలో విశిష్ఠమైన సేవలందించిన లబ్ధ ప్రతిష్టుల నెందరినో అందించింది. అందుకు తెలుగువారంతా సగర్వంగా తలెత్తుకోవడమే కాదు, తమ కీర్తిని శిఖరాయమానంగా చాటుకోవడానికి వీలు కల్పించింది. తెలుగు వెలుగులను నాలుగు చెరగుల విస్తరింపజేసిన తెలుగు మహనీయులెందరో ఉన్నారు. అటువంటి వారిలో వాగ్గేయకారుడు త్యాగయ్య, ఈనాటి విశ్వవిజ్ఞాని, మహావేదాంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివారు ఉన్నారు. అదే విధంగా పలురంగాలలో విశేషమైన కృషి జరిపి యావత్ ప్రపంచ దృష్టిని తమ వైపు ఆకర్షింపజేసుకున్న విద్యావేత్తలు, మహామేధావులు ఆర్కాటు సోదరులు. కవలలైన వీరు రామస్వామి మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ పేర్లతో ఆర్కాట్ సోదరులుగా గుర్తింపు పొందారు. వీరు కర్నూలులో జన్మించి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా పరిక్రమించి గణనీయమైన పేరు గడించారు. అన్ని తరాలవారు స్మరించుకోవలసిన వీరిని గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. అందుకే ఆ కవలల జీవితసంగ్రహాన్ని ఈ లఘు గ్రంథ రూపంలో అందించాలని సంకల్పించి ఈ ప్రయత్నాన్ని చేశాము.© 2017,www.logili.com All Rights Reserved.