డా|| సి. భవానీదేవి విద్యార్థిదశ నుండే తెలుగు భాష పై మమకారాన్ని పెంచుకుని సాహిత్య రంగంలో అడుగుపెట్టారు. బాపట్ల సాహితి వాతావరణంలో తండ్రిగారయిన శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మ గారి సాహితి వారసత్వాన్ని అందుకుని నిరంతరంగా వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తూ వచ్చారు. నలభై సంవత్సరాల సాహిత్య సేవలో కవిత్వం, కథ, నాటిక, నాటకం , పరిశోధన, లలితగీతాలు, సంగీతరూపకాలు, నవల, వ్యాసం, బాలసాహిత్యం , వెలువరించటం ముదావహం. మరికొన్ని అముద్రిత రచనలు వెలుగులోకి రాబోతున్నాయి కూడా! తెలుగులో నవ్యకవితారూపం "నానీలు" రాసిన తొలి కవయిత్రి భావానిదేవే! తెలుగు సాహితీవేత్తలు, పాఠకలోకం కూడా భవానీదేవి సాహిత్యాన్ని చిరకాలంగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు.