మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుండి ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. ఈ సజీవ జీవనయానం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. 90 సంవత్సరాల తెలుగు సంగీత చరిత్ర. అందులో ప్రతీ మలుపులోనూ అనసూయగారు నిర్వహించిన అసమానమైన పాత్రకి దర్పణం.
ఆమె వ్యక్తిగత జీవితానుభావాల రంగరింపు. ఆరు తరాల సుదీర్ఘమైన, సుసంపన్నమైన తెలుగు సంగీత, సాహిత్య, వ్యక్తిగత జీవితం, ఫోటోలు, ఆమె సేకరించిన ప్రముఖులు ఆటోగ్రాఫులూ అన్నింటినీ, సంగ్రహంగా అనిపించినా సమగ్రంగానే 'అసమాన అనసూయ' అనే ఈ అపురూపమైన, చారిత్రిక ప్రచురణకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాం. ఇది మా సంస్థకి షష్టి పూర్తి ప్రచురణ. అంటే 60వ ప్రచురణ కావడం కేవలం మా అదృష్టం.
- వంగూరి చిట్టెన్ రాజు
మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుండి ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. ఈ సజీవ జీవనయానం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. 90 సంవత్సరాల తెలుగు సంగీత చరిత్ర. అందులో ప్రతీ మలుపులోనూ అనసూయగారు నిర్వహించిన అసమానమైన పాత్రకి దర్పణం. ఆమె వ్యక్తిగత జీవితానుభావాల రంగరింపు. ఆరు తరాల సుదీర్ఘమైన, సుసంపన్నమైన తెలుగు సంగీత, సాహిత్య, వ్యక్తిగత జీవితం, ఫోటోలు, ఆమె సేకరించిన ప్రముఖులు ఆటోగ్రాఫులూ అన్నింటినీ, సంగ్రహంగా అనిపించినా సమగ్రంగానే 'అసమాన అనసూయ' అనే ఈ అపురూపమైన, చారిత్రిక ప్రచురణకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాం. ఇది మా సంస్థకి షష్టి పూర్తి ప్రచురణ. అంటే 60వ ప్రచురణ కావడం కేవలం మా అదృష్టం. - వంగూరి చిట్టెన్ రాజు© 2017,www.logili.com All Rights Reserved.