ఆచార్య మొదలి నాగభూషణశర్మ ప్రాచీన, అర్వాచీన నాటక రచనా ప్రయోగాలను అధ్యయనం చేసి, రంగస్థలం మీద ప్రయోగించిన దర్శకుడు. రాజా ఈడిపస్, మృచ్చకటిక, ముద్రారాక్షసం, ప్రజా నాయకుడు ప్రకాశం, అంధయుగం వంటి విభిన్న ప్రయోగ పద్ధతులతో తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు. సాహిత్య, నాటక విమర్శకుడుగా ఇంగ్లీషు, తెలుగు భాషల్లో 30 పుస్తకాలు వ్రాసి తరువాతి తరాల నాటకాభిమానులకు నాటక అరంగ చరిత్రను అందించారు. తెలుగు సాహిత్య, నాటక, నృత్య, జానపద ప్రక్రియలలో ప్రత్యేకమైన పరిశోధనలు చేశారు. వివిధ ప్రక్రియలపై 15 ఆంగ్ల గ్రంథాలను, 22 తెలుగు గ్రంథాలను ప్రచురించారు. 'ఇండియన్ థియేటర్ జర్నల్', 'నర్తనం' వంటి ప్రసిద్ధ పరిశోధనాత్మక పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు.
'ప్రఖ్యాత రంగస్థల - చలనచిత్ర నటుడు, గాన గంధర్వ, 'పద్మశ్రీ' ఈలపాట కల్యాణం రఘురామయ్య నటజీవితం' అన్న ఈ గ్రంథం రఘురామయ్య గారి వైవిధ్యభరితమైన నట జీవితాన్ని, ఆనాటి నాటకరంగ పరిణామక్రమ నేపథ్యంలో రఘురామయ్య చేసిన సేవను ఆవిష్కరిస్తుంది. నాటకరంగం మీద, సినిమా రంగంలోనూ ఆయన సాధించిన విజయ పరంపరలకు ఇది ఒక క్రమబద్ధమైన అనుక్రమణిక.
ఆచార్య మొదలి నాగభూషణశర్మ ప్రాచీన, అర్వాచీన నాటక రచనా ప్రయోగాలను అధ్యయనం చేసి, రంగస్థలం మీద ప్రయోగించిన దర్శకుడు. రాజా ఈడిపస్, మృచ్చకటిక, ముద్రారాక్షసం, ప్రజా నాయకుడు ప్రకాశం, అంధయుగం వంటి విభిన్న ప్రయోగ పద్ధతులతో తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు. సాహిత్య, నాటక విమర్శకుడుగా ఇంగ్లీషు, తెలుగు భాషల్లో 30 పుస్తకాలు వ్రాసి తరువాతి తరాల నాటకాభిమానులకు నాటక అరంగ చరిత్రను అందించారు. తెలుగు సాహిత్య, నాటక, నృత్య, జానపద ప్రక్రియలలో ప్రత్యేకమైన పరిశోధనలు చేశారు. వివిధ ప్రక్రియలపై 15 ఆంగ్ల గ్రంథాలను, 22 తెలుగు గ్రంథాలను ప్రచురించారు. 'ఇండియన్ థియేటర్ జర్నల్', 'నర్తనం' వంటి ప్రసిద్ధ పరిశోధనాత్మక పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. 'ప్రఖ్యాత రంగస్థల - చలనచిత్ర నటుడు, గాన గంధర్వ, 'పద్మశ్రీ' ఈలపాట కల్యాణం రఘురామయ్య నటజీవితం' అన్న ఈ గ్రంథం రఘురామయ్య గారి వైవిధ్యభరితమైన నట జీవితాన్ని, ఆనాటి నాటకరంగ పరిణామక్రమ నేపథ్యంలో రఘురామయ్య చేసిన సేవను ఆవిష్కరిస్తుంది. నాటకరంగం మీద, సినిమా రంగంలోనూ ఆయన సాధించిన విజయ పరంపరలకు ఇది ఒక క్రమబద్ధమైన అనుక్రమణిక.© 2017,www.logili.com All Rights Reserved.