నాటకకర్తగా 31 నాటకాలు తెలుగు కన్నడ ఆంగ్ల భాషల్లో రచించి తాను స్థాపించిన సరసవినోదిని సభ పక్షాన ఆ నాటకాలకు దర్శకత్వం వహించి ఆ నాటకాలన్నింటిలో ప్రధాన భూమికలను ప్రజారంజకంగా ధరించి వాటిని బళ్లారిలోనే కాక మదరాసు హైద్రాబాదు వంటి నగరాలలో విజయవంతంగా ప్రదర్శించి ఆంధ్రనాటక పితామహ అన్న గౌరవానికి సార్దకతను చేకూర్చిన నాటక కవిబ్రహ్మ ధర్మవరం రామకృష్ణాచార్యులు. ఆంధ్రదేశం నలుమూలలా పద్యనాటకానికి ప్రాచుర్యం కల్పించిన ఘనత ధర్మవరం వారిదే. ధర్మవరం వంశీకులు చేపట్టిన ధర్మవరం సంపూర్ణ నాటక గ్రంధావళికి పూర్వకంగా వెలువడుతున్న ఈ పరిశోధనా గ్రంథం అయన బహుముఖీనమైన ప్రతిభాపాటవాలకు ఒక నివాళి.
ఆచార్య మొదలి నాగభూషణ శర్మ రచయితగా నటునిగా దర్శకునిగా అధ్యాపకునిగా విమర్శకునిగా లబ్దప్రతిష్ఠులు ఉస్మానియా కేంద్ర తెలుగు విశ్వవిద్యాలయాల్లో నాటకశాఖల అద్యక్షులుగాను ప్రదర్శక కళ విభాగాల డీన్ గాను పనిచేశారు.
- ఆచార్య మొదలి నాగభూషణ శర్మ