ఆచార్య మొదలి నాగభూషణశర్మ నటుడు, నాటకరచయిత, దర్శకుడు, అధ్యాపకుడు, విమర్శకుడు. తండ్రిగారి ప్రోత్సాహంతో 8వ ఏటనే రంగస్థల ప్రవేశం చేసిన శ్రీ శర్మ 10స్వతంత్ర నాటకాలు, 16నాటికలు రాయడంతో పాటు, 12ఆంగ్ల నాటకాలను, 3సంస్కృత నాటకాలను, 8భారతీయ భాషా నాటకాలను అనువదించి, ఈ అన్ని నాటకాలను రంగస్థలం మీద ప్రయోగించి సరికొత్త శైలీరీతులకు శ్రీకారం చుట్టారు. మృచ్చకటిక, ముద్రారాక్షసం, ప్రజానాయకుడు ప్రకాశం, రాజా ఈడిపస్, కాయితం పులి, దొరా! నీ సావుమూడింది, హయవదన వంటి 60తెలుగు నాటకాలకు, 12ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించారు.
శర్మగారు సాహిత్య విమర్శకుడుగా "తెలుగు సాహిత్యం - గాంధీజీ ప్రభావం", "తెలుగు నవలా వికాసం" వంటి విమర్శకామోదం పొందిన గ్రంధాలను వెలువరించారు. నాటక విమర్శలో ఎనలేని కృషి చేసి, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో పలు గ్రంధాలను రచించారు. బళ్ళారి రాఘవ, ఆచార్య ఆత్రేయ, సురభి నాటకసమాజాల చరిత్ర, కన్యాశుల్కం - నూరేళ్ళ సమాలోచనం, నాటకరంగ పారిభాషిక పదకోశం, నాటక శిల్పం వంటి గ్రంధాలతో నాటక విమర్శకుడిగా లబ్దప్రతిష్టులైనారు.
ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఏ.డిగ్రీ, నాటక దర్శకత్వంలో ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎఫ్.ఏ. డిగ్రీ, అమెరికన్ నాటకాల మీద పిహెచ్.డి. పట్టా పొంది, 16సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్లశాఖలోనూ, 22సంవత్సరాలు ఉస్మానియా, కేంద్ర, తెలుగు విశ్వవిద్యాలయాలలో నాటకశాఖలో ఆచార్యులుగా పనిచేసి, ఎందరో విద్యార్ధులకు మార్గదర్శకులైనారు. దాదాపు 150 విద్యార్ధి ప్రదర్శనలకు ప్రయోక్తగా విద్యా నాటకరంగానికి సేవ చేశారు.
భారత శాస్త్రీయ నృత్యరీతుల అధ్యయనంలో భాగంగా "నర్తనమ్" అన్న ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య పరిశోధనా త్రైమాసికకు ప్రధాన సంపాదకులుగా (2001 - 2012) ఉండి ఎందరో విశిష్ట నృత్యకళాకారుల, గురువుల సేవను తమ అధికారికమైన వ్యాస పరంపర ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు జానపద కళారూపాల మీద సుదీర్ఘమైన క్షేత్ర పర్యటనలు చేసి, గ్రంధాలు రాసి, జానపద కళారూపాలను సాధికారికంగా ప్రయోగం చేసి ఆ కళలకు జాతీయ, అంతర్జాతీయ వేదికలలో గుర్తింపును సాధించారు.
శర్మగారు నాటక, నృత్య, జానపద, సాహిత్య రంగాలకు చేసిన సేవకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలను అందుకున్నారు. తానా జీవిత సాఫల్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాముర్తి పురస్కారం, వీరేశలింగం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, ఆత్రేయ వంటి మహామహుల పేరున వెలయించిన విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "యన్.టి.ఆర్. నంది పురస్కారం" (2012), కేంద్ర సంగీత నాటక అకాడమీ "టాగోర్ రత్న" పురస్కారం(2012), తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం(2013) ఇటివల వచ్చిన కొన్ని పురస్కారాలు.
"నటకావతంస' స్థానం నరసింహారావు నటజీవన ప్రస్థానం" అన్న ఈ గ్రంథం స్థానం వారికీ, శర్మగారికి ఉన్న అనుబంధానికి, స్థానం వారి నటనా వైదుష్యం పట్ల శర్మగారికి ఉన్న భక్తీశ్రద్ధలకు అక్షర రూపం. ఈ పుస్తకంతో పాటు సి.డి. కూడా పొందవచ్చు.
- మొదలి నాగభూషణశర్మ
ఆచార్య మొదలి నాగభూషణశర్మ నటుడు, నాటకరచయిత, దర్శకుడు, అధ్యాపకుడు, విమర్శకుడు. తండ్రిగారి ప్రోత్సాహంతో 8వ ఏటనే రంగస్థల ప్రవేశం చేసిన శ్రీ శర్మ 10స్వతంత్ర నాటకాలు, 16నాటికలు రాయడంతో పాటు, 12ఆంగ్ల నాటకాలను, 3సంస్కృత నాటకాలను, 8భారతీయ భాషా నాటకాలను అనువదించి, ఈ అన్ని నాటకాలను రంగస్థలం మీద ప్రయోగించి సరికొత్త శైలీరీతులకు శ్రీకారం చుట్టారు. మృచ్చకటిక, ముద్రారాక్షసం, ప్రజానాయకుడు ప్రకాశం, రాజా ఈడిపస్, కాయితం పులి, దొరా! నీ సావుమూడింది, హయవదన వంటి 60తెలుగు నాటకాలకు, 12ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించారు. శర్మగారు సాహిత్య విమర్శకుడుగా "తెలుగు సాహిత్యం - గాంధీజీ ప్రభావం", "తెలుగు నవలా వికాసం" వంటి విమర్శకామోదం పొందిన గ్రంధాలను వెలువరించారు. నాటక విమర్శలో ఎనలేని కృషి చేసి, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో పలు గ్రంధాలను రచించారు. బళ్ళారి రాఘవ, ఆచార్య ఆత్రేయ, సురభి నాటకసమాజాల చరిత్ర, కన్యాశుల్కం - నూరేళ్ళ సమాలోచనం, నాటకరంగ పారిభాషిక పదకోశం, నాటక శిల్పం వంటి గ్రంధాలతో నాటక విమర్శకుడిగా లబ్దప్రతిష్టులైనారు. ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఏ.డిగ్రీ, నాటక దర్శకత్వంలో ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎఫ్.ఏ. డిగ్రీ, అమెరికన్ నాటకాల మీద పిహెచ్.డి. పట్టా పొంది, 16సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్లశాఖలోనూ, 22సంవత్సరాలు ఉస్మానియా, కేంద్ర, తెలుగు విశ్వవిద్యాలయాలలో నాటకశాఖలో ఆచార్యులుగా పనిచేసి, ఎందరో విద్యార్ధులకు మార్గదర్శకులైనారు. దాదాపు 150 విద్యార్ధి ప్రదర్శనలకు ప్రయోక్తగా విద్యా నాటకరంగానికి సేవ చేశారు. భారత శాస్త్రీయ నృత్యరీతుల అధ్యయనంలో భాగంగా "నర్తనమ్" అన్న ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య పరిశోధనా త్రైమాసికకు ప్రధాన సంపాదకులుగా (2001 - 2012) ఉండి ఎందరో విశిష్ట నృత్యకళాకారుల, గురువుల సేవను తమ అధికారికమైన వ్యాస పరంపర ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు జానపద కళారూపాల మీద సుదీర్ఘమైన క్షేత్ర పర్యటనలు చేసి, గ్రంధాలు రాసి, జానపద కళారూపాలను సాధికారికంగా ప్రయోగం చేసి ఆ కళలకు జాతీయ, అంతర్జాతీయ వేదికలలో గుర్తింపును సాధించారు. శర్మగారు నాటక, నృత్య, జానపద, సాహిత్య రంగాలకు చేసిన సేవకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలను అందుకున్నారు. తానా జీవిత సాఫల్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాముర్తి పురస్కారం, వీరేశలింగం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, ఆత్రేయ వంటి మహామహుల పేరున వెలయించిన విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "యన్.టి.ఆర్. నంది పురస్కారం" (2012), కేంద్ర సంగీత నాటక అకాడమీ "టాగోర్ రత్న" పురస్కారం(2012), తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం(2013) ఇటివల వచ్చిన కొన్ని పురస్కారాలు. "నటకావతంస' స్థానం నరసింహారావు నటజీవన ప్రస్థానం" అన్న ఈ గ్రంథం స్థానం వారికీ, శర్మగారికి ఉన్న అనుబంధానికి, స్థానం వారి నటనా వైదుష్యం పట్ల శర్మగారికి ఉన్న భక్తీశ్రద్ధలకు అక్షర రూపం. ఈ పుస్తకంతో పాటు సి.డి. కూడా పొందవచ్చు. - మొదలి నాగభూషణశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.