A Dictionary of Theatre Terms

Rs.300
Rs.300

A Dictionary of Theatre Terms
INR
CREATIVE13
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                  తెలుగు నాటకరంగంలో వాడుకలో ఉన్న పాశ్చాత్య సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధకాలు, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో ఆ పదాలకు వివరణలు.

                పాశ్చాత్య దేశాల నాటకరంగ చరిత్రను గురించిన అంశాలు.

                విభిన్న నాటక ఉద్యమాల, సిద్దంతాల సంక్షిప్త పరిచయమే "నాటకరంగ పారిభాషిక పదకోశం".

ఆచార్య మొదలి నాగభూషణశర్మ (రచయిత గురించి) :

               8వ ఏటనే తండ్రిగారి ప్రోత్సాహంతో నాటకరంగ ప్రవేశం చేసిన నాగభూషణ శర్మగారు 16వ ఏట - 1951లో - శరత్ బాబు నవల "రాముని బుద్ధిమంతతనం" నాటకీకరణతో నాటక రచన, నటన, దర్శకత్వాలకు శ్రీకారం చుట్టి, 17వ ఏట నార్ల వెంకటేశ్వరరావుగారి "భంగపాటు, కొత్తగడ్డ" నాటికల ద్వారాను, మునిమాణిక్యం "గృహప్రవేశం" నాటకం ద్వారాను నటనలో పాఠాలు నేర్చుకొని 18వ ఏట మధురవాణి పాత్రధారణతో రంగస్థలంలో స్థిరపడ్డారు. 19వ ఏట "అన్వేషణ" నాటిక 'భారతి' మానసపత్రికలో ప్రచురించబదినప్పటి నుంచి 1954 -64 మధ్యకాలంలో 14 నాటికలను, 3 నాటకాలను భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక వంటి ప్రముఖ పత్రికలలో రాసి, రంగస్థలంమీద ప్రదర్శించారు. 1958 లో ఆంధ్రప్రభ ఆదివారం సాహిత్యానుబంధంలో ప్రచురితం అయిన "తెలుగు నాటకం - పాశ్చాత్య ప్రభావం", "భారతీయ దేశిరూపకాలు" నార్లవారి మన్ననలు పొంది శర్మగారి సాహిత్య విమర్శనా ప్రస్థానానికి నాంది పలికాయి. ఆ తరువాత వచ్చిన "తెలుగు సాహిత్యం - గాంధీజీ ప్రభావం", "తెలుగు నవలా వికాసం" సాహిత్య విమర్శకునిగా శర్మగారి స్థానాన్ని సుస్థిరం చేశాయి.

             అయిదు దశాబ్దాలపాటు నాటకరచన, నటన, దర్శకత్వం, విమర్శన తమ జీవితాశయంగా స్వీకరించి ఆంగ్లంలో 15, తెలుగులో 20 గ్రంధాలను రచించారు. 1973లో అమెరికా నుంచి రంగస్థల దర్శకత్వం ప్రధానాంశంగా పట్టభద్రులై, ఆంగ్ల నాటకాలను దర్శకత్వం వహిస్తూ, అమెరికన్ నాటకరంగం మీద పిహెచ్.డి. చేసి 1983లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటక శాఖకు ఆచార్యులై ఆంద్రదేశంలో తొలి నాటక ఆచార్యులుగా వుండి, దేశంలోని నాటక విద్యాబోధనకు కావలసిన మౌలిక ప్రణాళికను రూపొందించడంతో పాటు వందలాది యువ నటీ, నట, దర్శకులకు మార్గదర్శకులైనారు. స్వతంత్ర నాటకాలతో పాటు ప్రఖ్యాత పాశ్చ్యాత, సంస్కృత, భారతీయ భాషా నాటకాలను అనువదించి, వాటికి దర్శకత్వం వహించి సరికొత్త శైలీ రీతులకు శ్రీకారం చుట్టారు. తమ ఆంగ్ల, ఆంధ్రగ్రంధాల ద్వారా తెలుగు నాటక విమర్శకు ప్రామాణికతను సాధించారు.

            ఆచార్య శర్మగారు తమ పరిశోధనా పరిధిని విస్తృతం చేసుకొని, భారతీయ నృత్య, జానపదరీతుల మీద విస్తృతమైన పరిశోధన, క్షేత్రపర్యటనలు చేసి తెలుగువారి జానపద ప్రదర్శక కళలమీద అధికారికమైన గ్రంధాలు వెలయించారు. భారతీయ శాస్త్రీయ నృత్యసంప్రదాయాలమీద ప్రచురింపబడుతున్న "నర్తనమ్" పత్రికకు శర్మగారు ప్రధాన సంపాదకులు. వీరు రచించిన ప్రాచ్య పాశ్చాత్య నాటకరీతుల తులనాత్మక అధ్యయన గ్రంధం "నాటకశిల్పం" సాహిత్యవేత్తల సన్మానం పొందింది. "కన్యాశుల్కం - నూరేళ్ల సమాలోచనం", సురభి నాటక సంప్రదాయం మీద రాసిన అధికారికమైన ఆంగ్ల గ్రంధం తెలుగు నాటకవిమర్శలో శర్మగారికి సమున్నతమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

 

                  తెలుగు నాటకరంగంలో వాడుకలో ఉన్న పాశ్చాత్య సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధకాలు, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో ఆ పదాలకు వివరణలు.                 పాశ్చాత్య దేశాల నాటకరంగ చరిత్రను గురించిన అంశాలు.                 విభిన్న నాటక ఉద్యమాల, సిద్దంతాల సంక్షిప్త పరిచయమే "నాటకరంగ పారిభాషిక పదకోశం". ఆచార్య మొదలి నాగభూషణశర్మ (రచయిత గురించి) :                8వ ఏటనే తండ్రిగారి ప్రోత్సాహంతో నాటకరంగ ప్రవేశం చేసిన నాగభూషణ శర్మగారు 16వ ఏట - 1951లో - శరత్ బాబు నవల "రాముని బుద్ధిమంతతనం" నాటకీకరణతో నాటక రచన, నటన, దర్శకత్వాలకు శ్రీకారం చుట్టి, 17వ ఏట నార్ల వెంకటేశ్వరరావుగారి "భంగపాటు, కొత్తగడ్డ" నాటికల ద్వారాను, మునిమాణిక్యం "గృహప్రవేశం" నాటకం ద్వారాను నటనలో పాఠాలు నేర్చుకొని 18వ ఏట మధురవాణి పాత్రధారణతో రంగస్థలంలో స్థిరపడ్డారు. 19వ ఏట "అన్వేషణ" నాటిక 'భారతి' మానసపత్రికలో ప్రచురించబదినప్పటి నుంచి 1954 -64 మధ్యకాలంలో 14 నాటికలను, 3 నాటకాలను భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక వంటి ప్రముఖ పత్రికలలో రాసి, రంగస్థలంమీద ప్రదర్శించారు. 1958 లో ఆంధ్రప్రభ ఆదివారం సాహిత్యానుబంధంలో ప్రచురితం అయిన "తెలుగు నాటకం - పాశ్చాత్య ప్రభావం", "భారతీయ దేశిరూపకాలు" నార్లవారి మన్ననలు పొంది శర్మగారి సాహిత్య విమర్శనా ప్రస్థానానికి నాంది పలికాయి. ఆ తరువాత వచ్చిన "తెలుగు సాహిత్యం - గాంధీజీ ప్రభావం", "తెలుగు నవలా వికాసం" సాహిత్య విమర్శకునిగా శర్మగారి స్థానాన్ని సుస్థిరం చేశాయి.              అయిదు దశాబ్దాలపాటు నాటకరచన, నటన, దర్శకత్వం, విమర్శన తమ జీవితాశయంగా స్వీకరించి ఆంగ్లంలో 15, తెలుగులో 20 గ్రంధాలను రచించారు. 1973లో అమెరికా నుంచి రంగస్థల దర్శకత్వం ప్రధానాంశంగా పట్టభద్రులై, ఆంగ్ల నాటకాలను దర్శకత్వం వహిస్తూ, అమెరికన్ నాటకరంగం మీద పిహెచ్.డి. చేసి 1983లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటక శాఖకు ఆచార్యులై ఆంద్రదేశంలో తొలి నాటక ఆచార్యులుగా వుండి, దేశంలోని నాటక విద్యాబోధనకు కావలసిన మౌలిక ప్రణాళికను రూపొందించడంతో పాటు వందలాది యువ నటీ, నట, దర్శకులకు మార్గదర్శకులైనారు. స్వతంత్ర నాటకాలతో పాటు ప్రఖ్యాత పాశ్చ్యాత, సంస్కృత, భారతీయ భాషా నాటకాలను అనువదించి, వాటికి దర్శకత్వం వహించి సరికొత్త శైలీ రీతులకు శ్రీకారం చుట్టారు. తమ ఆంగ్ల, ఆంధ్రగ్రంధాల ద్వారా తెలుగు నాటక విమర్శకు ప్రామాణికతను సాధించారు.             ఆచార్య శర్మగారు తమ పరిశోధనా పరిధిని విస్తృతం చేసుకొని, భారతీయ నృత్య, జానపదరీతుల మీద విస్తృతమైన పరిశోధన, క్షేత్రపర్యటనలు చేసి తెలుగువారి జానపద ప్రదర్శక కళలమీద అధికారికమైన గ్రంధాలు వెలయించారు. భారతీయ శాస్త్రీయ నృత్యసంప్రదాయాలమీద ప్రచురింపబడుతున్న "నర్తనమ్" పత్రికకు శర్మగారు ప్రధాన సంపాదకులు. వీరు రచించిన ప్రాచ్య పాశ్చాత్య నాటకరీతుల తులనాత్మక అధ్యయన గ్రంధం "నాటకశిల్పం" సాహిత్యవేత్తల సన్మానం పొందింది. "కన్యాశుల్కం - నూరేళ్ల సమాలోచనం", సురభి నాటక సంప్రదాయం మీద రాసిన అధికారికమైన ఆంగ్ల గ్రంధం తెలుగు నాటకవిమర్శలో శర్మగారికి సమున్నతమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.  

Features

  • : A Dictionary of Theatre Terms
  • : Modali Nagabhushana Sarma
  • : Creative Links
  • : CREATIVE13
  • : Paperback
  • : 398
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:A Dictionary of Theatre Terms

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam