నాథు
నాథురాం గాడ్సేకు తలనొప్పిగా ఉంది. అయినా అతను తన చూపును బిర్లా హౌస్ నుండి లాన్లోకి వచ్చే ద్వారంపై స్థిరంగా నిలిపి ఉంచాడు. కొత్త ఢిల్లీలోని ఆ విశాల భవంతిలో మహాత్మాగాంధీ ఉంటున్నారు. ద్వారానికి పదడుగుల దూరంలో లాన్లో గుమికూడిన జనంలో కలిసిపోయి ఉన్నాడు గాడ్సే. సాయంత్రం ప్రార్థనల కోసం మహాత్మాగాంధీ చెక్కబల్ల మీదికి వెళ్లే మార్గంలో వేచి ఉన్నాడు. ఏ క్షణంలోనయినా గాంధీజీ లాన్లోకి రావచ్చు. కనుక గాడ్సే ఆయన రాక కోసం నిఘా వేసి ఎదురు చూస్తున్నాడు. అది 1948 జనవరి 30వ తేది. సాయంత్రం ఐదుంబావు అవుతోంది. గాడ్సె మొహానికి చలికాలపు చల్లని గాలులు తగులుతున్నాయి. ఆకాశం క్రమంగా చీకటి పులుముకోనుంది.
గుమికూడిన వారిలో ఏదో కదలిక. గాంధీజీ ప్రవేశ ద్వారం దగ్గరకి వచ్చారు. వరుసకు మనుమరాళ్ళయ్యే ఇద్దరు యువతుల భుజాలపై చేతులు వేసి నడుస్తున్నారు. కుడివైపు మను, ఎడమవైపు ఆభా ఉన్నారు. ఆయన ముఖంపై చిరునవ్వు వెలిగింది. నడుస్తున్న గాంధీజీ ఒక్కసారి ఆగి మను, ఆభాల భుజాలపై నుండి చేతులు తీశారు. రెండు చేతులను జోడించి అక్కడ గుమికూడిన వారివైపు చూస్తూ చిరునవ్వుతో నమస్కరించారు. '
గాడ్సె చేయి తన జేబులో ఉన్న పిస్టల్ పైకి వెళ్లింది. శబ్దం రాకుండా సేఫ్టీని తొలగించాడు." అతనిలో ఆందోళన లేదు. ఏదో అశాంతి మాత్రం ఉంది. నమస్కారం చేశాక గాంధీజీ వడివడిగా చెక్కబల్ల వైపు అడుగులు వేశారు. గాంధీజీ.............
© 2017,www.logili.com All Rights Reserved.