"గౌతమ బుద్ధుని అనంతరం భారతదేశంలో ఇంతటి మహావ్యక్తి జన్మించలేదు. జీసస్ క్రీస్తు అనంతరం ప్రపంచం ఇంతటి మహానీయుడని చూడలేదు" అని రెవరెండ్ డా. జె. హెచ్ హోమ్స్ అను అమెరికన్ మిషనరీ మహాత్మాగాంధీని ప్రస్తుతిస్తే, ప్రపంచ ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్ స్టీన్ "మహాత్మాగాంధీ వంటి వ్యక్తీ ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేక పోవచ్చును" అని వ్యాఖ్యానించారు.
అతి సామాన్యుడైన మోహన్ దాస్ అసామాన్యుడైన తన జీవిత కాలంలో మహాత్ముడనిపించుకోవడం ఎలా సాధ్యమైంది? శ్రీ యు. ఆర్. రావు రచించిన గాంధీజీ జీవిత విశేషాలు చదివితే మనకు అర్థమవుతుంది. "నా జీవితమే నా సందేశం" అన్నారు మహాత్మాగాంధీ. గాంధీ జీవితంలోని అద్భుత ఘట్టాలను తీసుకుని సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా శ్రీ యు. ఆర్. రావు రచన సాగింది.
"గౌతమ బుద్ధుని అనంతరం భారతదేశంలో ఇంతటి మహావ్యక్తి జన్మించలేదు. జీసస్ క్రీస్తు అనంతరం ప్రపంచం ఇంతటి మహానీయుడని చూడలేదు" అని రెవరెండ్ డా. జె. హెచ్ హోమ్స్ అను అమెరికన్ మిషనరీ మహాత్మాగాంధీని ప్రస్తుతిస్తే, ప్రపంచ ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్ స్టీన్ "మహాత్మాగాంధీ వంటి వ్యక్తీ ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేక పోవచ్చును" అని వ్యాఖ్యానించారు. అతి సామాన్యుడైన మోహన్ దాస్ అసామాన్యుడైన తన జీవిత కాలంలో మహాత్ముడనిపించుకోవడం ఎలా సాధ్యమైంది? శ్రీ యు. ఆర్. రావు రచించిన గాంధీజీ జీవిత విశేషాలు చదివితే మనకు అర్థమవుతుంది. "నా జీవితమే నా సందేశం" అన్నారు మహాత్మాగాంధీ. గాంధీ జీవితంలోని అద్భుత ఘట్టాలను తీసుకుని సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా శ్రీ యు. ఆర్. రావు రచన సాగింది.© 2017,www.logili.com All Rights Reserved.