1977లో ప్రచురించిన డిఎన్ ఝా 'ప్రాచీన భారతదేశం - ఒక స్థూల పరిచయం'ను కూలంకషంగా సవరించి, విస్తృతపరిచిన పుస్తకం ఈ 'ప్రాచీన భారతదేశం'. ప్రాచీన భారత చరిత్రలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిణామాలను ప్రధానంగా భౌతిక ప్రాతిపదిక ఆధారంగా ఇది విశదీకరించి విశ్లేషిస్తుంది. దోపిడి స్వభావంలో వచ్చిన మార్పులు, దాని ఫలితంగా సమాజంలో తలెత్తిన ఉద్రిక్తతలు, మతం, మూఢ విశ్వాసాలు సమాజంలో నిర్వహించిన పాత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. భారత చరిత్ర గురించి హిందూ ఛాందసవాదుల వాదనలకు ఇది చక్కటి సమాధానం. భారత సమాజం మార్పులేనిది, చలన రహితమైనదన్న వాదనలను కూడ ఈ పుస్తకం తిప్పికొడుతుంది. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజిలో 1957 లో పట్టభద్రులయ్యారు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1959 లో ఎంఏ పట్టా పొంది 1964లో అక్కడే పిహెచ్‌డి చేశారు. 1975 వరకు అదే విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులుగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. డిఎన్‌ఝా
1977లో ప్రచురించిన డిఎన్ ఝా 'ప్రాచీన భారతదేశం - ఒక స్థూల పరిచయం'ను కూలంకషంగా సవరించి, విస్తృతపరిచిన పుస్తకం ఈ 'ప్రాచీన భారతదేశం'. ప్రాచీన భారత చరిత్రలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిణామాలను ప్రధానంగా భౌతిక ప్రాతిపదిక ఆధారంగా ఇది విశదీకరించి విశ్లేషిస్తుంది. దోపిడి స్వభావంలో వచ్చిన మార్పులు, దాని ఫలితంగా సమాజంలో తలెత్తిన ఉద్రిక్తతలు, మతం, మూఢ విశ్వాసాలు సమాజంలో నిర్వహించిన పాత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. భారత చరిత్ర గురించి హిందూ ఛాందసవాదుల వాదనలకు ఇది చక్కటి సమాధానం. భారత సమాజం మార్పులేనిది, చలన రహితమైనదన్న వాదనలను కూడ ఈ పుస్తకం తిప్పికొడుతుంది. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజిలో 1957 లో పట్టభద్రులయ్యారు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1959 లో ఎంఏ పట్టా పొంది 1964లో అక్కడే పిహెచ్‌డి చేశారు. 1975 వరకు అదే విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులుగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. డిఎన్‌ఝా© 2017,www.logili.com All Rights Reserved.