ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత, అస్పృశ్యతా నిర్మూలనకై, కులమత భేదభావాలను పారద్రోలి సమసమాజ నిర్మాణానికై అనవరతం కృషిసల్పిన ప్రముఖ సాంఘిక విప్లవకారులు, నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానాన్ని రూపొందించి ప్రప్రధమంగా ప్రపంచమంతటా నాస్తికత్వవ్యాప్తికి దేశదేశాలు పర్యటించిన నాస్తికోద్యమ నాయకులు, రాజకీయ ఆర్ధిక రంగాలలో మార్పులకై ఎన్నో ఉద్యమాలు నడిపి మానవుని వ్యక్తిత్వ వికాసానికి, స్వాతంత్ర పరిరక్షణకు పోరాటం సల్పిన ధీశాలి.
మాటకు - చేతకు వారధి, నిరంతర ఆశావాదిగా, విరామమెరుగక పురోగమించిన సత్యాన్వేషి, ప్రజలలోని మౌడ్యాన్ని పారద్రోలి శాస్త్రీయ దృక్పథాన్ని, చైతన్యాన్ని, మానవత్వ దృక్పథాన్ని పెంపొందించడానికై కృషిసల్పిన గొప్ప వ్యక్తి, నిరాడంబరత, మొక్కవోని ధైర్యం, సమాజానికి ఎదురీదగల సాహసం, వాస్తవికత - సంఘదృష్టి - వ్యక్తిత్వం గల గోరా, తన విశిష్టజీవితం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు, చేస్తున్నారు. 1902 లో జన్మించి 1975 జులై 26 న ఒక సభలో ప్రసంగిస్తూ హఠాత్తుగా మరణించిన గోరా మహోన్నత జీవిత గాథను శ్రీ వల్లభనేని కాశీ విశ్వనాథం ఈ పుస్తకంలో చక్కగా వివరించారు.
ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత, అస్పృశ్యతా నిర్మూలనకై, కులమత భేదభావాలను పారద్రోలి సమసమాజ నిర్మాణానికై అనవరతం కృషిసల్పిన ప్రముఖ సాంఘిక విప్లవకారులు, నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానాన్ని రూపొందించి ప్రప్రధమంగా ప్రపంచమంతటా నాస్తికత్వవ్యాప్తికి దేశదేశాలు పర్యటించిన నాస్తికోద్యమ నాయకులు, రాజకీయ ఆర్ధిక రంగాలలో మార్పులకై ఎన్నో ఉద్యమాలు నడిపి మానవుని వ్యక్తిత్వ వికాసానికి, స్వాతంత్ర పరిరక్షణకు పోరాటం సల్పిన ధీశాలి. మాటకు - చేతకు వారధి, నిరంతర ఆశావాదిగా, విరామమెరుగక పురోగమించిన సత్యాన్వేషి, ప్రజలలోని మౌడ్యాన్ని పారద్రోలి శాస్త్రీయ దృక్పథాన్ని, చైతన్యాన్ని, మానవత్వ దృక్పథాన్ని పెంపొందించడానికై కృషిసల్పిన గొప్ప వ్యక్తి, నిరాడంబరత, మొక్కవోని ధైర్యం, సమాజానికి ఎదురీదగల సాహసం, వాస్తవికత - సంఘదృష్టి - వ్యక్తిత్వం గల గోరా, తన విశిష్టజీవితం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు, చేస్తున్నారు. 1902 లో జన్మించి 1975 జులై 26 న ఒక సభలో ప్రసంగిస్తూ హఠాత్తుగా మరణించిన గోరా మహోన్నత జీవిత గాథను శ్రీ వల్లభనేని కాశీ విశ్వనాథం ఈ పుస్తకంలో చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.