"ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు" అంటాడు శ్రీశ్రీ 'దేశచరిత్రలు'లో. 'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?' అని ప్రశ్నించాడు. 'సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది?” అని అడుగుతాడు. ఇది రాసే సమయానికి భారతరాజ్యం పైన సామాన్యుల దండయాత్ర గురించి శ్రీశ్రీ ఆలోచించలేదు. ఆ దండయాత్రలో సామాన్యుడి సాహసం ఎటువంటిదో తెలుసుకోవడం ఈ తరానికీ, భావితరాలకీ అవసరం.
తిప్పాని వెంకట్రావ్ (టీవీ) అసామాన్యుడని ఆయన ఆత్మకథ 'గుర్తుకొస్తున్నాయ్' చదివితే తెలుస్తుంది. ఎవరైనా ఆత్మకథ ఎందుకు రాస్తారు? ప్రతిమనిషి నిజజీవితంలో ఎంతో సంఘర్షణ ఉంటుంది. సంక్షోభం ఉంటుంది. సంచలనం ఉంటుంది. ఎత్తుపల్లాలు ఉంటాయి. సుఖదుఃఖాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదురైన సవాళ్ళను తనదైన రీతిలో ఎదుర్కొంటాడు. మనుషుల జీవితంలోని రహస్యం సజీవంగా ఎట్లా ఉన్నామన్నది కాదు, దేనికోసం జీవిస్తున్నామో తెలుసుకోవడం అంటాడు ప్రఖ్యాత రష్యన్ రచయిత దోస్తోవిస్కీ. ఆత్మకథ రాయడం అంటే ఆత్మసాక్షాత్కారం చేసుకోవడం. జ్ఞాపకాల పుట్టని తవ్వడం. సింహావలోకనం చేయడం. జీవితంలో నేర్చుకున్న పాఠాలు
ఇతరులకు తెలియజెప్పడం. జయాపజయాల గురించి వివరించడం. తన జీవితంలో ఎదురైన ఉద్విగ్నక్షణాలను ఇతరులతో పంచుకోవడం. నాటి కాలమాన పరిస్థితులను ప్రస్తావించడం. వ్యక్తుల గురించీ, వ్యక్తిత్వాల గురించీ కలబోసుకోవడం.
"ఇతిహాసపు చీకటికోణంఅట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు" అంటాడు శ్రీశ్రీ 'దేశచరిత్రలు'లో. 'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?' అని ప్రశ్నించాడు. 'సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది?” అని అడుగుతాడు. ఇది రాసే సమయానికి భారతరాజ్యం పైన సామాన్యుల దండయాత్ర గురించి శ్రీశ్రీ ఆలోచించలేదు. ఆ దండయాత్రలో సామాన్యుడి సాహసం ఎటువంటిదో తెలుసుకోవడం ఈ తరానికీ, భావితరాలకీ అవసరం. తిప్పాని వెంకట్రావ్ (టీవీ) అసామాన్యుడని ఆయన ఆత్మకథ 'గుర్తుకొస్తున్నాయ్' చదివితే తెలుస్తుంది. ఎవరైనా ఆత్మకథ ఎందుకు రాస్తారు? ప్రతిమనిషి నిజజీవితంలో ఎంతో సంఘర్షణ ఉంటుంది. సంక్షోభం ఉంటుంది. సంచలనం ఉంటుంది. ఎత్తుపల్లాలు ఉంటాయి. సుఖదుఃఖాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదురైన సవాళ్ళను తనదైన రీతిలో ఎదుర్కొంటాడు. మనుషుల జీవితంలోని రహస్యం సజీవంగా ఎట్లా ఉన్నామన్నది కాదు, దేనికోసం జీవిస్తున్నామో తెలుసుకోవడం అంటాడు ప్రఖ్యాత రష్యన్ రచయిత దోస్తోవిస్కీ. ఆత్మకథ రాయడం అంటే ఆత్మసాక్షాత్కారం చేసుకోవడం. జ్ఞాపకాల పుట్టని తవ్వడం. సింహావలోకనం చేయడం. జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇతరులకు తెలియజెప్పడం. జయాపజయాల గురించి వివరించడం. తన జీవితంలో ఎదురైన ఉద్విగ్నక్షణాలను ఇతరులతో పంచుకోవడం. నాటి కాలమాన పరిస్థితులను ప్రస్తావించడం. వ్యక్తుల గురించీ, వ్యక్తిత్వాల గురించీ కలబోసుకోవడం.
© 2017,www.logili.com All Rights Reserved.