"హంపీ నుంచి హరప్పా దాక" లో అరవైఒక్క అధ్యాయాలు అరవై ఒక్క కథలుగా చదివిస్తాయి. స్వవిషయాలను ఇంతటి సృజనాత్మక భావుకతతో, ప్రతిభతో ఆవిష్కరించడం రామచంద్రగారి వంటి ఉపగణాప్రాభవులకు మాత్రమే సాధ్యమేమో! ఏభైఆరో అధ్యాయంలో భర్తృహరి శ్లోకాన్ని ఉటంకిస్తూ రామచంద్రగారు "మానసవీ కార్యార్థీ నగణయతి దుఃఖం న చ సుఖం" అన్నారు. నిజానికి సమకాలీన తెలుగు సాహితీ లోకంలో రామచంద్రతో సాటిరాగల మనస్వి కల్పించరు.
ఆయన ఏనాడూ స్వీయకార్యార్థికారు. స్థితప్రజ్ఞులు. సుఖదుఃఖాలను పట్టించుకోని ప్రజ్ఞాశాలి. భర్తృహరి చెప్పిన మనస్వి విషయంలో ఒక విశేషముంది. ఆ మనస్వి ఎప్పుడైనా మృదుపర్యంకశయన సుఖికావచ్చు. పట్టువస్త్రాలు కట్టవచ్చు. కాని రామచంద్రగారు యాదృచ్చికంగా అవి లభించినా వాటిపట్ల ఎటువంటి ఆసక్తీ చూపని మనస్వి. అవసరమైతే పరులకోసం వాటిని వదులుకోగల అచ్చ స్వచ్చ హృదయులాయన. భర్తృహరే సజ్జనజీవన సంపదను ఇట్లా వర్ణించాడు.
వాంఛా సజ్జనసంగతౌ పరుగణే ప్రీతి ర్గురౌ నమ్రతా
విద్యాయా వ్యసనం స్వయోషితరతి లోకాపవాదాద్భయం
భక్తిశ్మూలిని శక్తి రాత్మదమనే సంసర్గముక్తి ఖలై
రైతే యాత్ర వాసంతి నిర్మలగుణా తేభ్యో నమః కుర్మహే.
ఇందులో చెప్పిన సర్వసద్గుణాలకూ మూర్తిమంతమైనది రామచంద్రగారి వ్యక్తిత్వం. తరుణ వయస్సులోనే ఆయన దేశం కోసం కారాగారవాసాన్ని వరించారు. ఆయన దేశభక్తి నిరుపమానం. ఊహ తెలిసినప్పటి నుంచీ వారు ఖద్దరు ఉడుపులనే ధరించారు. సంస్కృత కళాశాలలో చదువుతూ కూడా భావాలతో నవీనాశయాలతో ఉత్తమాదర్శాలతో వారు తమ జీవితాన్ని దిద్ది తీర్చుకున్నారు.
"హంపీ నుంచి హరప్పా దాక" లో అరవైఒక్క అధ్యాయాలు అరవై ఒక్క కథలుగా చదివిస్తాయి. స్వవిషయాలను ఇంతటి సృజనాత్మక భావుకతతో, ప్రతిభతో ఆవిష్కరించడం రామచంద్రగారి వంటి ఉపగణాప్రాభవులకు మాత్రమే సాధ్యమేమో! ఏభైఆరో అధ్యాయంలో భర్తృహరి శ్లోకాన్ని ఉటంకిస్తూ రామచంద్రగారు "మానసవీ కార్యార్థీ నగణయతి దుఃఖం న చ సుఖం" అన్నారు. నిజానికి సమకాలీన తెలుగు సాహితీ లోకంలో రామచంద్రతో సాటిరాగల మనస్వి కల్పించరు. ఆయన ఏనాడూ స్వీయకార్యార్థికారు. స్థితప్రజ్ఞులు. సుఖదుఃఖాలను పట్టించుకోని ప్రజ్ఞాశాలి. భర్తృహరి చెప్పిన మనస్వి విషయంలో ఒక విశేషముంది. ఆ మనస్వి ఎప్పుడైనా మృదుపర్యంకశయన సుఖికావచ్చు. పట్టువస్త్రాలు కట్టవచ్చు. కాని రామచంద్రగారు యాదృచ్చికంగా అవి లభించినా వాటిపట్ల ఎటువంటి ఆసక్తీ చూపని మనస్వి. అవసరమైతే పరులకోసం వాటిని వదులుకోగల అచ్చ స్వచ్చ హృదయులాయన. భర్తృహరే సజ్జనజీవన సంపదను ఇట్లా వర్ణించాడు. వాంఛా సజ్జనసంగతౌ పరుగణే ప్రీతి ర్గురౌ నమ్రతా విద్యాయా వ్యసనం స్వయోషితరతి లోకాపవాదాద్భయం భక్తిశ్మూలిని శక్తి రాత్మదమనే సంసర్గముక్తి ఖలై రైతే యాత్ర వాసంతి నిర్మలగుణా తేభ్యో నమః కుర్మహే. ఇందులో చెప్పిన సర్వసద్గుణాలకూ మూర్తిమంతమైనది రామచంద్రగారి వ్యక్తిత్వం. తరుణ వయస్సులోనే ఆయన దేశం కోసం కారాగారవాసాన్ని వరించారు. ఆయన దేశభక్తి నిరుపమానం. ఊహ తెలిసినప్పటి నుంచీ వారు ఖద్దరు ఉడుపులనే ధరించారు. సంస్కృత కళాశాలలో చదువుతూ కూడా భావాలతో నవీనాశయాలతో ఉత్తమాదర్శాలతో వారు తమ జీవితాన్ని దిద్ది తీర్చుకున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.