Ida Mana Police Vyavastha

By Vinay Kumar Singh (Author), Adepu Lakshmi Pathi (Author)
Rs.199
Rs.199

Ida Mana Police Vyavastha
INR
VISHALA462
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         'ఇదా మన పోలీసు వ్యవస్థ?' అనే ఈ గ్రంథాన్ని రచయిత 23 ఏళ్ళపాటు ఒక పోలీసు అధికారిగా తాను గడించిన అనుభవాల ఆధారంగా రాశారు. వార్తాపత్రికల్లో, అధికార గణాల్లో, ప్రభుత్వ వర్గాల్లో, బ్లాగు గ్రూపుల్లో వాడి, వేడి చర్చకు ఈ పుస్తకం తెరతీసింది. దీని ముద్రణకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగేళ్ల కాలం పట్టింది.

          రచయిత వాస్తవ, వ్యక్తిగత అనుభవాల్లోంచి రూపుదిద్దుకున్న ఈ పుస్తకం పోలీసు సంస్థ దృక్పథాన్ని, వ్యవహారశైలిని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. సామాన్య ప్రజానీకాన్ని, అదేరీతిలో పోలీసులనూ రాచి రంపాన పెడుతూన్న పోలీసు వ్యవస్థ వలువలూడదీసిందీ పుస్తకం. ఇది పుస్తకం కాదు. ఇదో దార్శనిక గ్రంథం. అంతకుమించి - ప్రజల సామాజిక, ఆర్ధిక జీవనదృశ్యాన్ని మార్చేందుకు ఈ వ్యవస్థకున్న పుష్కలమైన వనరులను, అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా విధాన నిర్ణేతలకు, పోలీసు ఉద్యోగులకు సంకేతమందించే దివిటీ ఇది.

          ఒక పోలీసు అధికారిగా రచయిత, పోలీసును ఒక సామాజిక సేవకుని రూపంలో సాక్షాత్కరింపజేస్తాడు. ఈ పుస్తకం విషయ రూపంలో విస్తృతిలో పెద్దది, స్వభావంలో క్రూరమైనది. పదవిలో ఉన్న పోలీసు అధికారిలో ఇలాంటి ముక్కుసూటితనం, భోళాతనం చాలా అరుదుగా కనబడుతాయి. ఈ పుస్తకములో చూపించినట్లుగా ప్రజలపట్ల ఆందోళన, పోలీసు పాత్ర గురించిన ఆశావహ దృక్పథం మరే పోలీసు నిపుణుడు వ్యక్తం చేయలేదు. భావి విధాన నిర్ణేతలకు, పోలీసులకు ఈ పుస్తకం మంచి రిఫరెన్స్ పాయింట్ గా ఉపయోగపడుతుంది.   

         'ఇదా మన పోలీసు వ్యవస్థ?' అనే ఈ గ్రంథాన్ని రచయిత 23 ఏళ్ళపాటు ఒక పోలీసు అధికారిగా తాను గడించిన అనుభవాల ఆధారంగా రాశారు. వార్తాపత్రికల్లో, అధికార గణాల్లో, ప్రభుత్వ వర్గాల్లో, బ్లాగు గ్రూపుల్లో వాడి, వేడి చర్చకు ఈ పుస్తకం తెరతీసింది. దీని ముద్రణకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగేళ్ల కాలం పట్టింది.           రచయిత వాస్తవ, వ్యక్తిగత అనుభవాల్లోంచి రూపుదిద్దుకున్న ఈ పుస్తకం పోలీసు సంస్థ దృక్పథాన్ని, వ్యవహారశైలిని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. సామాన్య ప్రజానీకాన్ని, అదేరీతిలో పోలీసులనూ రాచి రంపాన పెడుతూన్న పోలీసు వ్యవస్థ వలువలూడదీసిందీ పుస్తకం. ఇది పుస్తకం కాదు. ఇదో దార్శనిక గ్రంథం. అంతకుమించి - ప్రజల సామాజిక, ఆర్ధిక జీవనదృశ్యాన్ని మార్చేందుకు ఈ వ్యవస్థకున్న పుష్కలమైన వనరులను, అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా విధాన నిర్ణేతలకు, పోలీసు ఉద్యోగులకు సంకేతమందించే దివిటీ ఇది.           ఒక పోలీసు అధికారిగా రచయిత, పోలీసును ఒక సామాజిక సేవకుని రూపంలో సాక్షాత్కరింపజేస్తాడు. ఈ పుస్తకం విషయ రూపంలో విస్తృతిలో పెద్దది, స్వభావంలో క్రూరమైనది. పదవిలో ఉన్న పోలీసు అధికారిలో ఇలాంటి ముక్కుసూటితనం, భోళాతనం చాలా అరుదుగా కనబడుతాయి. ఈ పుస్తకములో చూపించినట్లుగా ప్రజలపట్ల ఆందోళన, పోలీసు పాత్ర గురించిన ఆశావహ దృక్పథం మరే పోలీసు నిపుణుడు వ్యక్తం చేయలేదు. భావి విధాన నిర్ణేతలకు, పోలీసులకు ఈ పుస్తకం మంచి రిఫరెన్స్ పాయింట్ గా ఉపయోగపడుతుంది.   

Features

  • : Ida Mana Police Vyavastha
  • : Vinay Kumar Singh
  • : Abhipraay Publications
  • : VISHALA462
  • : Paperback
  • : 2015
  • : 268
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ida Mana Police Vyavastha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam