ఇది....పేరుకు మాత్రమే నా కథ. ఇందులో అనేక పాత్రలున్నాయి. అందులో ఏ ఒక్కటీ ఊహాజనితం కాదు. అన్నీ సమాజంలోని సజీవ పాత్రలే. మానవుడు సంఘజీవి. సమాజం తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తీ తానుగా ఎదగలేడు. నా జీవనయానంలో అనేక పాత్రలు అడుగడుగునా నాతో కలిసి నడుస్తాయి.
నా జీవితంలో కష్టాలున్నాయ్. కన్నీళ్ళున్నాయ్. పోలాలున్నాయ్. హలాలున్నాయ్. పలుగులున్నాయ్. పారలున్నాయ్. ఎత్తులున్నాయ్.పల్లాలున్నాయ్. నూతులున్నాయ్. గోతులున్నాయ్. చీకటీ ముసిరిన పవళ్ళున్నాయ్. నిద్రకు నోచని రాత్రులున్నాయ్. జలగండాలున్నాయ్. సుడిగుండాలున్నాయ్. చెప్పులులేని కాళ్ళున్నాయ్. చెడుపెరుగని చేతులున్నాయ్. చిక్కీ చిక్కని సౌఖ్యాలున్నాయ్. లెక్కలేని అవరోధాలున్నాయ్. ఎదురు చూడని భోగాలున్నాయ్. ఎదను రగిల్చిన రోగాలున్నాయ్.
చివరగా ఒక విజ్ఞప్తి. ప్రతి కథలోనూ ముందువెనుకలుంటాయి. నాకథ కూడా అలాగే నడుస్తుంది. ఎందుకంటారా! కష్టాలే తోడుగా పుట్టిన నేను నా జీవనయానాన్ని కథగా రూపొందించే స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదు. అందుకని ఏది ఎప్పుడు జరిగింది అన్నది రాసిపెట్టుకోలేదు. ఆ కారణంగా కథాగమనం సన్నివేశాలను బట్టి అటూ ఇటూ మారుతుంటుంది. పాఠకులు ఈ విషయం గ్రహించ ప్రార్థన. ఈ నా కథ ఏ ఒక్కరికి మార్గదర్శకమైనా జీవితం ధన్యమైనట్లు భావిస్తాను.
- మల్లెమాల
ఇది....పేరుకు మాత్రమే నా కథ. ఇందులో అనేక పాత్రలున్నాయి. అందులో ఏ ఒక్కటీ ఊహాజనితం కాదు. అన్నీ సమాజంలోని సజీవ పాత్రలే. మానవుడు సంఘజీవి. సమాజం తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తీ తానుగా ఎదగలేడు. నా జీవనయానంలో అనేక పాత్రలు అడుగడుగునా నాతో కలిసి నడుస్తాయి. నా జీవితంలో కష్టాలున్నాయ్. కన్నీళ్ళున్నాయ్. పోలాలున్నాయ్. హలాలున్నాయ్. పలుగులున్నాయ్. పారలున్నాయ్. ఎత్తులున్నాయ్.పల్లాలున్నాయ్. నూతులున్నాయ్. గోతులున్నాయ్. చీకటీ ముసిరిన పవళ్ళున్నాయ్. నిద్రకు నోచని రాత్రులున్నాయ్. జలగండాలున్నాయ్. సుడిగుండాలున్నాయ్. చెప్పులులేని కాళ్ళున్నాయ్. చెడుపెరుగని చేతులున్నాయ్. చిక్కీ చిక్కని సౌఖ్యాలున్నాయ్. లెక్కలేని అవరోధాలున్నాయ్. ఎదురు చూడని భోగాలున్నాయ్. ఎదను రగిల్చిన రోగాలున్నాయ్. చివరగా ఒక విజ్ఞప్తి. ప్రతి కథలోనూ ముందువెనుకలుంటాయి. నాకథ కూడా అలాగే నడుస్తుంది. ఎందుకంటారా! కష్టాలే తోడుగా పుట్టిన నేను నా జీవనయానాన్ని కథగా రూపొందించే స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదు. అందుకని ఏది ఎప్పుడు జరిగింది అన్నది రాసిపెట్టుకోలేదు. ఆ కారణంగా కథాగమనం సన్నివేశాలను బట్టి అటూ ఇటూ మారుతుంటుంది. పాఠకులు ఈ విషయం గ్రహించ ప్రార్థన. ఈ నా కథ ఏ ఒక్కరికి మార్గదర్శకమైనా జీవితం ధన్యమైనట్లు భావిస్తాను. - మల్లెమాల© 2017,www.logili.com All Rights Reserved.