చుక్కాని
1999 నవంబరు రెండవ వారంలో నేను దాశరథి. రంగాచార్యులవారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ సమావేశం తెలుగులో వచన వేదాలు ప్రచురితం కావడానికి దోహదపడటం, తద్వారా ఎమెస్కో పేరు మరోసారి తెలుగువారి ఇంటింటికీ చేరడం, సమాజంలో దాదాపు అన్ని వర్గాలలోని ఆలోచనాపరులకు ఈ సంస్థ దగ్గర కావడం నిర్వాహకుడిగా నాకు ఒక అద్భుతమైన అనుభవం.
అప్పటికే నవలలు చదివేవారు చాలా తగ్గిపోయారు. ఆ ఖాళీని పూరించడానికి అనేక ప్రయత్నాలు చేశాను. మిత్రుడు యండమూరితో వ్యక్తిత్వ వికాసం గ్రంథాల రచనను ప్రారంభింపచేసాను. ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధించాను. ఈ రకమైన పుస్తకాలకు విస్తృతమైన మార్కెట్ వుండే అవకాశం వుందని నిరూపితమైంది.
వీరేంద్రనాధ్ ఆత్మీయ మిత్రుడు అయినప్పటికీ అప్పటికే ఆయనకు | వేరొక ప్రచురణకర్తతో దీర్ఘకాలిక సంబంధాలు ఉండటంవలన ఆయనపై ఆధారపడటం నా సంస్థకు సురక్షితమైనదిగా నేను భావించలేదు. అప్పటినుంచి ఓ పేరు కోసం వెతుకులాట జరుగుతూనే వుంది. ఎంత కష్టమైనా వేదాల ద్వారా ఎమెస్కో పొందిన స్థానాన్ని వదులుకోకూడదని నిరంతరం ఆలోచిస్తూనే వున్నాను.
ఆ సమయంలో నాకు మార్గదర్శకులు, మిత్రులు శ్రీ రామచంద్ర మూర్తిగారు వార్త దినపత్రికలో డా.బి.వి.పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస...........
చుక్కాని 1999 నవంబరు రెండవ వారంలో నేను దాశరథి. రంగాచార్యులవారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ సమావేశం తెలుగులో వచన వేదాలు ప్రచురితం కావడానికి దోహదపడటం, తద్వారా ఎమెస్కో పేరు మరోసారి తెలుగువారి ఇంటింటికీ చేరడం, సమాజంలో దాదాపు అన్ని వర్గాలలోని ఆలోచనాపరులకు ఈ సంస్థ దగ్గర కావడం నిర్వాహకుడిగా నాకు ఒక అద్భుతమైన అనుభవం. అప్పటికే నవలలు చదివేవారు చాలా తగ్గిపోయారు. ఆ ఖాళీని పూరించడానికి అనేక ప్రయత్నాలు చేశాను. మిత్రుడు యండమూరితో వ్యక్తిత్వ వికాసం గ్రంథాల రచనను ప్రారంభింపచేసాను. ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధించాను. ఈ రకమైన పుస్తకాలకు విస్తృతమైన మార్కెట్ వుండే అవకాశం వుందని నిరూపితమైంది. వీరేంద్రనాధ్ ఆత్మీయ మిత్రుడు అయినప్పటికీ అప్పటికే ఆయనకు | వేరొక ప్రచురణకర్తతో దీర్ఘకాలిక సంబంధాలు ఉండటంవలన ఆయనపై ఆధారపడటం నా సంస్థకు సురక్షితమైనదిగా నేను భావించలేదు. అప్పటినుంచి ఓ పేరు కోసం వెతుకులాట జరుగుతూనే వుంది. ఎంత కష్టమైనా వేదాల ద్వారా ఎమెస్కో పొందిన స్థానాన్ని వదులుకోకూడదని నిరంతరం ఆలోచిస్తూనే వున్నాను. ఆ సమయంలో నాకు మార్గదర్శకులు, మిత్రులు శ్రీ రామచంద్ర మూర్తిగారు వార్త దినపత్రికలో డా.బి.వి.పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస...........© 2017,www.logili.com All Rights Reserved.