ఇంద్రగారి విలక్షణ ఆత్మకథ
ఆత్మకథలు మనని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. అవి నిజంగా జీవించిన మనుషుల కథలు కనుక అనుక్షణం మనను మనం తడుముకుంటూ రచయితలతో పోల్చుకుంటూ చదువుతాం. కావాలని పోల్చుకోం. అదొక అసంకల్పిత ప్రక్రియ.
ఇంద్రగారి ఆత్మకథ వంటిది మరీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఎంచేతంటే అరుదైన నిజం కనక.
రాజమండ్రిలో ఉండడం కోసమని, ఉండడం మాత్రమే ముఖ్యమని, కెరీరును కాలదన్ని ఎలిమెంటరీ స్కూలు టీచరుద్యోగానికి రాజీ పడడం ఏమిటి? టీచర్లు చెప్పేదంతా వట్టి పనికిమాలిన చదువని ఒక హైస్కూలు స్థాయి కుర్రాడే తేల్చేసుకుని స్కూలుకు వెళ్ళి కూడా వెనకబెంచీలో కూచుని తన చదువేదో తనే చదివేసుకోవడం ఏమిటి? (అవి కూడా ఏ పుస్తకాలంటే మహమ్మదీయ మహాయుగం, చైనాలో ఎర్ర విప్లవం లాంటి బైండు పుస్తకాలు) భరించలేని పేదరికంలో కూడా అంత ఆత్మాభిమానం ఏమిటి? రాజుల్ని అసహ్యించుకునే పెద్దమనిషికి చరిత్ర అన్నా చారిత్రక స్థలాల ఏమిటి? దేవుడిని నమ్మని వ్యక్తి దేవాలయాలలోని ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడడం ఏమిటి? భార్యకు, పెళ్ళికాకముందు పాతికేసి పేజీల ఉత్తరాలు పరంపరగా రాసి తానేమిటో తన ఆలోచనలేమిటో చెబుతూ సంసారానికి కావలసిన పునాదిగా సఖ్యతను, విద్యను అందించడమేమిటి? అసలు ఒక మనిషి చాలామేరకు పరిస్థితులకి అనుగుణంగా తనను తాను మలుచుకుని జీవించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని, అందరినీ అన్నింటినీ ఎదిరించి బతికి చూపించడం ఏమిటి? (ఇంకా ఇలాంటి చాలా ఏమిటుల్ని లేవనెత్తే పుస్తకం ఇది.
అలా ఆలోచించే ఆచరించే ఒకానొక మనిషి జీవితం ఎలా నడిచింది, ఎలా నడుస్తోంది. అన్నది ఈ పుస్తకంలో చదవొచ్చు. అదీ ఈ పుస్తకాన్ని అరుదూ, ఆసక్తికరమూ చేస్తున్న విశేషం.
ఇంద్రగారు ఇద్దరు. ఒక మనిషి కాదు. ఒకాయన శుద్ధ సాత్వికులు. ఏ కోశానా కోపమే లేనివారు. తన మానాన తను బతికే మనిషి, 'ఇంత మర్యాదగా మెలగడం నాకు చేతనౌతుందా.. అని చాలాసార్లు నాకు అనుమానం కలిగించే మనిషి, ఇదంతా ఇంద్ర నెంబర్ ఒన్.
రెండో ఆయన ఘాటు రచయిత. నిర్భయులు. నిర్మొహమాటి. చెప్పదలుచుకున్న విషయం ఉంటేనే కలం తీస్తారు. (ఈ రచన కూడా అలా వచ్చిందే. కథల్లో చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పడం కోసం రాస్తున్నాను ఈ స్వీయ కథ అన్నారు నాతో, అనేకానేక విషయాల మీద ఆయనకు 'లోక అసాధారణమైన, ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. వాటన్నింటినీ తన రచనల్లో కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఆయన దగ్గర చాలా కుండలుంటాయి.............
ఇంద్రగారి విలక్షణ ఆత్మకథ ఆత్మకథలు మనని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. అవి నిజంగా జీవించిన మనుషుల కథలు కనుక అనుక్షణం మనను మనం తడుముకుంటూ రచయితలతో పోల్చుకుంటూ చదువుతాం. కావాలని పోల్చుకోం. అదొక అసంకల్పిత ప్రక్రియ. ఇంద్రగారి ఆత్మకథ వంటిది మరీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఎంచేతంటే అరుదైన నిజం కనక. రాజమండ్రిలో ఉండడం కోసమని, ఉండడం మాత్రమే ముఖ్యమని, కెరీరును కాలదన్ని ఎలిమెంటరీ స్కూలు టీచరుద్యోగానికి రాజీ పడడం ఏమిటి? టీచర్లు చెప్పేదంతా వట్టి పనికిమాలిన చదువని ఒక హైస్కూలు స్థాయి కుర్రాడే తేల్చేసుకుని స్కూలుకు వెళ్ళి కూడా వెనకబెంచీలో కూచుని తన చదువేదో తనే చదివేసుకోవడం ఏమిటి? (అవి కూడా ఏ పుస్తకాలంటే మహమ్మదీయ మహాయుగం, చైనాలో ఎర్ర విప్లవం లాంటి బైండు పుస్తకాలు) భరించలేని పేదరికంలో కూడా అంత ఆత్మాభిమానం ఏమిటి? రాజుల్ని అసహ్యించుకునే పెద్దమనిషికి చరిత్ర అన్నా చారిత్రక స్థలాల ఏమిటి? దేవుడిని నమ్మని వ్యక్తి దేవాలయాలలోని ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడడం ఏమిటి? భార్యకు, పెళ్ళికాకముందు పాతికేసి పేజీల ఉత్తరాలు పరంపరగా రాసి తానేమిటో తన ఆలోచనలేమిటో చెబుతూ సంసారానికి కావలసిన పునాదిగా సఖ్యతను, విద్యను అందించడమేమిటి? అసలు ఒక మనిషి చాలామేరకు పరిస్థితులకి అనుగుణంగా తనను తాను మలుచుకుని జీవించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని, అందరినీ అన్నింటినీ ఎదిరించి బతికి చూపించడం ఏమిటి? (ఇంకా ఇలాంటి చాలా ఏమిటుల్ని లేవనెత్తే పుస్తకం ఇది. అలా ఆలోచించే ఆచరించే ఒకానొక మనిషి జీవితం ఎలా నడిచింది, ఎలా నడుస్తోంది. అన్నది ఈ పుస్తకంలో చదవొచ్చు. అదీ ఈ పుస్తకాన్ని అరుదూ, ఆసక్తికరమూ చేస్తున్న విశేషం. ఇంద్రగారు ఇద్దరు. ఒక మనిషి కాదు. ఒకాయన శుద్ధ సాత్వికులు. ఏ కోశానా కోపమే లేనివారు. తన మానాన తను బతికే మనిషి, 'ఇంత మర్యాదగా మెలగడం నాకు చేతనౌతుందా.. అని చాలాసార్లు నాకు అనుమానం కలిగించే మనిషి, ఇదంతా ఇంద్ర నెంబర్ ఒన్. రెండో ఆయన ఘాటు రచయిత. నిర్భయులు. నిర్మొహమాటి. చెప్పదలుచుకున్న విషయం ఉంటేనే కలం తీస్తారు. (ఈ రచన కూడా అలా వచ్చిందే. కథల్లో చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పడం కోసం రాస్తున్నాను ఈ స్వీయ కథ అన్నారు నాతో, అనేకానేక విషయాల మీద ఆయనకు 'లోక అసాధారణమైన, ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. వాటన్నింటినీ తన రచనల్లో కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఆయన దగ్గర చాలా కుండలుంటాయి.............© 2017,www.logili.com All Rights Reserved.