అధ్యయనం చేసిన భౌతికశాస్త్రం: చదువుకొన్న, కొంటున్న సాహిత్యం; ఇష్టపడే సామాజిక దృక్పథం; చేస్తున్న ఆకాశవాణి ఉద్యోగం; కొనసాగిస్తున్న మీడియా పరిశోధనం - అర్థవంతంగా మేళవించి డా. నాగసూరి వేణుగోపాల్ ను ప్రయోజనకరమైన అంశాలపై బాగా చదివించేగుణంతో రాయిస్తున్నాను. అందుకే పాపులర్ సైన్సు, సాహిత్యం, పర్యావరణం, జనమాధ్యమాలు, సామాజికం - ఇలా దేనికి సంబంధించి స్పృశించినా వారి కాలంలో హేతుబద్ధత ముప్పేటగా కలగలసి కనబడుతాయి. సుమారు మూడు దశాబ్దాలుగా దాదాపు ముప్పయికాలమ్స్, నలభైకిమించి పుస్తకాలు వెలువరించిన 'నాగసూరి' జనరంజక విజ్ఞాన రచనల ద్వారా చేసిన కృషి విభిన్నమైనదీ, విలక్షణమైనదీ!
సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి;ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమేకాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే 'ప్రగతికి ప్రస్తానం - సైన్సు' అని అంటున్నాం.
అధ్యయనం చేసిన భౌతికశాస్త్రం: చదువుకొన్న, కొంటున్న సాహిత్యం; ఇష్టపడే సామాజిక దృక్పథం; చేస్తున్న ఆకాశవాణి ఉద్యోగం; కొనసాగిస్తున్న మీడియా పరిశోధనం - అర్థవంతంగా మేళవించి డా. నాగసూరి వేణుగోపాల్ ను ప్రయోజనకరమైన అంశాలపై బాగా చదివించేగుణంతో రాయిస్తున్నాను. అందుకే పాపులర్ సైన్సు, సాహిత్యం, పర్యావరణం, జనమాధ్యమాలు, సామాజికం - ఇలా దేనికి సంబంధించి స్పృశించినా వారి కాలంలో హేతుబద్ధత ముప్పేటగా కలగలసి కనబడుతాయి. సుమారు మూడు దశాబ్దాలుగా దాదాపు ముప్పయికాలమ్స్, నలభైకిమించి పుస్తకాలు వెలువరించిన 'నాగసూరి' జనరంజక విజ్ఞాన రచనల ద్వారా చేసిన కృషి విభిన్నమైనదీ, విలక్షణమైనదీ! సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి;ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమేకాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే 'ప్రగతికి ప్రస్తానం - సైన్సు' అని అంటున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.