మా ఇంటి దేవతలు బాలగేయ సంపుటిలో 50 బాలగేయాలున్నాయి. ఈ గేయాలు పెద్దల పట్ల వినయం, ప్రకృతి పట్ల ప్రేమ, మంచి నడవడిక, మంచి అలవాట్లను పిల్లల్లో కలిగించగలవని నా నమ్మకం! గేయాలన్నీ పిల్లలు హాయిగా పాడుకోవడానికి వీలుగా మాత్రా ఛందస్సులో రాయబడ్డాయి.
వెన్నెలలోనా చల్లదనం
వెన్నముద్దలో మెత్తదనం
తేనెదారలో మధురగుణం
అమ్మ పిలుపులో ఉన్నవిరా!
మంచుగడ్డలో స్వచ్చదనం
మల్లెపువ్వులో తెల్లదనం
గంధపు చెక్కలో సౌగంధం
అమ్మ తలపులో ఉన్నవిరా!
గౌతమ బుద్ధుని కారుణ్యం
మదర్ థెరీసా మమకారం
సృష్టియందలీ అనురాగం
అమ్మతోడులో ఉన్నవిరా!
మా ఇంటి దేవతలు బాలగేయ సంపుటిలో 50 బాలగేయాలున్నాయి. ఈ గేయాలు పెద్దల పట్ల వినయం, ప్రకృతి పట్ల ప్రేమ, మంచి నడవడిక, మంచి అలవాట్లను పిల్లల్లో కలిగించగలవని నా నమ్మకం! గేయాలన్నీ పిల్లలు హాయిగా పాడుకోవడానికి వీలుగా మాత్రా ఛందస్సులో రాయబడ్డాయి. వెన్నెలలోనా చల్లదనం వెన్నముద్దలో మెత్తదనం తేనెదారలో మధురగుణం అమ్మ పిలుపులో ఉన్నవిరా! మంచుగడ్డలో స్వచ్చదనం మల్లెపువ్వులో తెల్లదనం గంధపు చెక్కలో సౌగంధం అమ్మ తలపులో ఉన్నవిరా! గౌతమ బుద్ధుని కారుణ్యం మదర్ థెరీసా మమకారం సృష్టియందలీ అనురాగం అమ్మతోడులో ఉన్నవిరా!
© 2017,www.logili.com All Rights Reserved.