జిడ్డు కృష్ణమూర్తి చెప్పినది ఏమిటి అని తెలుసుకోగోరే పాఠకుల కోసం ఈ సంకలన గ్రంధాన్ని ప్రచరిస్తున్నాము. ఇంతకుముందు కృష్ణమూర్తి రచనలు చదివినవారికి ఇది ఒక పరిచయ సంపుటంగా ఉపయోగ పడుతుంది. విభిన్నమైన శాఖలకు చెందిన రచనలు ఇందులో చోటు చేసుకున్నాయి. సభా ప్రసంగాలు, సందేహాలకు సమాధానాలు, వ్యాస రచనలు, ఇంటర్వ్యూలు, దినచర్య వృత్తాంతాలు, ఇతరులకు చెప్పి వ్రాయించినవి, లేఖలు, సంవాదాలు, చర్చలు వీటిలో జీవితానికి సంబందించిన అత్యంత ప్రధానమైన అంశాలను నిర్దుష్టతతో దృశ్యికరించారు. ఆయన భోధనలు శిఖరాగ్ర స్థాయిని చేరుకున్న కలం నుండి సేకరించినవి అన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.
సత్యం మానవుడి మనస్సు నిర్మించుకున్న పరిమితులకు ఆవలగా తెలుసుకున్న వాటికి, సూత్రికరించిన వాటికి లేదా కల్పన చేసుకున్న వాటికి ఆవలగా ఉంటుందని, సత్యం కోసం అన్వేషిస్తున్నపుడు "మొదటి అడుగే చివరిది" అని అంటారు. కృష్ణమూర్తి. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆరంభించడంలోని వైశిష్ట్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఆ విధంగా చూస్తే ప్రతివారు ఈ జీవన పయనంలో ఆరంభికులే. ఈ దృష్టితో చూసినప్పుడు ఈ సంకలనం అందరికోసము అని చెప్పవచ్చు.
-కె. కృష్ణమూర్తి.
జిడ్డు కృష్ణమూర్తి చెప్పినది ఏమిటి అని తెలుసుకోగోరే పాఠకుల కోసం ఈ సంకలన గ్రంధాన్ని ప్రచరిస్తున్నాము. ఇంతకుముందు కృష్ణమూర్తి రచనలు చదివినవారికి ఇది ఒక పరిచయ సంపుటంగా ఉపయోగ పడుతుంది. విభిన్నమైన శాఖలకు చెందిన రచనలు ఇందులో చోటు చేసుకున్నాయి. సభా ప్రసంగాలు, సందేహాలకు సమాధానాలు, వ్యాస రచనలు, ఇంటర్వ్యూలు, దినచర్య వృత్తాంతాలు, ఇతరులకు చెప్పి వ్రాయించినవి, లేఖలు, సంవాదాలు, చర్చలు వీటిలో జీవితానికి సంబందించిన అత్యంత ప్రధానమైన అంశాలను నిర్దుష్టతతో దృశ్యికరించారు. ఆయన భోధనలు శిఖరాగ్ర స్థాయిని చేరుకున్న కలం నుండి సేకరించినవి అన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సత్యం మానవుడి మనస్సు నిర్మించుకున్న పరిమితులకు ఆవలగా తెలుసుకున్న వాటికి, సూత్రికరించిన వాటికి లేదా కల్పన చేసుకున్న వాటికి ఆవలగా ఉంటుందని, సత్యం కోసం అన్వేషిస్తున్నపుడు "మొదటి అడుగే చివరిది" అని అంటారు. కృష్ణమూర్తి. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆరంభించడంలోని వైశిష్ట్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఆ విధంగా చూస్తే ప్రతివారు ఈ జీవన పయనంలో ఆరంభికులే. ఈ దృష్టితో చూసినప్పుడు ఈ సంకలనం అందరికోసము అని చెప్పవచ్చు. -కె. కృష్ణమూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.