కథలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందరమూ చెవులు కోసుకుని విన్నవాళ్ళమే కదా! చందమామ, బాలమిత్ర కథల నుండి, పలు రకాల తాత్విక విశ్లేషణల వరకు, పరోపకారి పాపయ్య చేసే మంచి పనుల నుండి మానవ జీవిత సంక్లిష్టతల వరకు ఈ కథలే కదా మనకు తెలియజెప్పింది. భేతాళ కథలకు సమాధానాలు వెతకడం నుండి అంతరంగ కల్లోలాల, అనుతాప, సానుతాప విశ్లేషణల వరకు మానవ జీవిత సారాన్ని ఒడగొట్టి, పిడికిటబట్టి మనముందు నిలుపుతున్నవి కథలే కదా! లక్ష్మీ కృష్ణమూర్తి గారి ఈ కథా సంకలనంలోని శైలి చాల పరిచితమైన శైలి. పిల్లల బాగుకోరి, మంచీ చెడూ వివరించి చెపే అమ్మల శైలి. తన సుదీర్ఘ జీవనయాత్రలో కన్నవీ, విన్నవీ, అనుకోన్నవీ, అనుభవించినవీ, అవలోకించినవీ, అభిలాషించినవీ, స్వప్నించినవీ, అనేక అనుభవాలు ఈ కథల్లో కనిపిస్తాయి.
కథలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందరమూ చెవులు కోసుకుని విన్నవాళ్ళమే కదా! చందమామ, బాలమిత్ర కథల నుండి, పలు రకాల తాత్విక విశ్లేషణల వరకు, పరోపకారి పాపయ్య చేసే మంచి పనుల నుండి మానవ జీవిత సంక్లిష్టతల వరకు ఈ కథలే కదా మనకు తెలియజెప్పింది. భేతాళ కథలకు సమాధానాలు వెతకడం నుండి అంతరంగ కల్లోలాల, అనుతాప, సానుతాప విశ్లేషణల వరకు మానవ జీవిత సారాన్ని ఒడగొట్టి, పిడికిటబట్టి మనముందు నిలుపుతున్నవి కథలే కదా! లక్ష్మీ కృష్ణమూర్తి గారి ఈ కథా సంకలనంలోని శైలి చాల పరిచితమైన శైలి. పిల్లల బాగుకోరి, మంచీ చెడూ వివరించి చెపే అమ్మల శైలి. తన సుదీర్ఘ జీవనయాత్రలో కన్నవీ, విన్నవీ, అనుకోన్నవీ, అనుభవించినవీ, అవలోకించినవీ, అభిలాషించినవీ, స్వప్నించినవీ, అనేక అనుభవాలు ఈ కథల్లో కనిపిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.