తెలుగు సినిమా టాకీ చరిత్ర 'భక్త ప్రహ్లాద' చిత్రంతో 1932లో మొదలైతే, నా నట జీవితం బాలనటిగా 1936లో 'భక్త ధృవ అనసూయ' చిత్రంతో మొదలైంది. 1938లో 'కచదేవయాని' చిత్రంతో కథానాయికగా జీవితం ప్రారంభమైంది. మీరాపురం రాజావారితో వివాహం అయ్యాక, స్టూడియో నిర్మాణం, చిత్ర నిర్మాణం, నట జీవితం ఈ మూడు ఏకోన్ముఖంగా ముందడుగు వేశాయి.
నన్ను అభిమానించే జి.శ్రీనివాస్ నా వద్దకు వచ్చి నా జీవితచరిత్ర గ్రంథంగా వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులుగా
భావించే సినీ చరిత్రకారుడు ఎస్.వి.రామారావు అదే విషయాన్ని పట్టుబట్టి రచనాపరంగా సహకరించడంతో, ఐదు సంవత్సరాల కిందట ప్రారంభించిన రచనా ప్రయత్నం ఈ గ్రంథ రూపంలో ఈనాటికి ఓ కొలిక్కి వచ్చింది. ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించిన ప్రజానటి, కళాభారతి, పార్లమెంట్ పూర్వ సభ్యురాలు శ్రీమతి జమున, 'భక్తప్రహ్లాద' ఫ్రేమ్ రోజారమణి గార్లకు ధన్యవాదాలు.
తెలుగు సినిమా టాకీ చరిత్ర 'భక్త ప్రహ్లాద' చిత్రంతో 1932లో మొదలైతే, నా నట జీవితం బాలనటిగా 1936లో 'భక్త ధృవ అనసూయ' చిత్రంతో మొదలైంది. 1938లో 'కచదేవయాని' చిత్రంతో కథానాయికగా జీవితం ప్రారంభమైంది. మీరాపురం రాజావారితో వివాహం అయ్యాక, స్టూడియో నిర్మాణం, చిత్ర నిర్మాణం, నట జీవితం ఈ మూడు ఏకోన్ముఖంగా ముందడుగు వేశాయి. నన్ను అభిమానించే జి.శ్రీనివాస్ నా వద్దకు వచ్చి నా జీవితచరిత్ర గ్రంథంగా వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులుగా భావించే సినీ చరిత్రకారుడు ఎస్.వి.రామారావు అదే విషయాన్ని పట్టుబట్టి రచనాపరంగా సహకరించడంతో, ఐదు సంవత్సరాల కిందట ప్రారంభించిన రచనా ప్రయత్నం ఈ గ్రంథ రూపంలో ఈనాటికి ఓ కొలిక్కి వచ్చింది. ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాలను అందించిన ప్రజానటి, కళాభారతి, పార్లమెంట్ పూర్వ సభ్యురాలు శ్రీమతి జమున, 'భక్తప్రహ్లాద' ఫ్రేమ్ రోజారమణి గార్లకు ధన్యవాదాలు.
© 2017,www.logili.com All Rights Reserved.