సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొలది తదనుగుణంగా మానవ మేధ విస్తరిస్తున్నా మనుసులు కుచించుకు పోతున్నాయి. స్వార్థం మేటవేసి మంచితనానికి ముసుగు వేసి మనిషినే మాయం చేస్తోంది. ఫోను ద్వారానే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, డయల్ యువర్ మీల్స్ స్కీంలు, ఆన్ లైన్ ఆర్డర్లు ఇవి మనిషిని స్వత౦త్రుడిని చేసి మనుసుకు సంకెళ్ళు వేశాయి. జీవన వేగంలో మనుగడకే ప్రాముఖ్యత పెరిగి మానవత్వపు మధురిమలు మృగ్యమై, స్నేహ సౌరభాలు శున్యమై, అనుబంధాలు ఆవిరైపోతున్నాయి.
నిజమేనా? మమతానుబంధాలు కుటుంబ వ్యవస్థలో కూడా అడుగంటుతాయా? ఔనా?......కాదా?.....ఆగండి! ఒక్క క్షణం ఆలోచించండి. అదిగో......మనసు సంద్రాన ప్రేమకెరటం.....పెల్లుబుకుతున్న సాగర కెరటం! సాగరాన్ని వీడిపోలేని కెరటం కీరవాణి రాగామాలపిస్తోంది. మమతల సాగర కెరటాలను మళ్ళి అక్కున చేర్చుకోంటో౦ది. మనిషి అంతర్ముఖుడై తనను తాను విక్షించుకున్నప్పుడు గోచరించే మనోజ్ఞ దృశ్యమిది. ఈ దృశ్యానికి ప్రతి బింబమే.......'సాగర్ కెరటం'
-సి. ఉమాదేవి.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొలది తదనుగుణంగా మానవ మేధ విస్తరిస్తున్నా మనుసులు కుచించుకు పోతున్నాయి. స్వార్థం మేటవేసి మంచితనానికి ముసుగు వేసి మనిషినే మాయం చేస్తోంది. ఫోను ద్వారానే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, డయల్ యువర్ మీల్స్ స్కీంలు, ఆన్ లైన్ ఆర్డర్లు ఇవి మనిషిని స్వత౦త్రుడిని చేసి మనుసుకు సంకెళ్ళు వేశాయి. జీవన వేగంలో మనుగడకే ప్రాముఖ్యత పెరిగి మానవత్వపు మధురిమలు మృగ్యమై, స్నేహ సౌరభాలు శున్యమై, అనుబంధాలు ఆవిరైపోతున్నాయి. నిజమేనా? మమతానుబంధాలు కుటుంబ వ్యవస్థలో కూడా అడుగంటుతాయా? ఔనా?......కాదా?.....ఆగండి! ఒక్క క్షణం ఆలోచించండి. అదిగో......మనసు సంద్రాన ప్రేమకెరటం.....పెల్లుబుకుతున్న సాగర కెరటం! సాగరాన్ని వీడిపోలేని కెరటం కీరవాణి రాగామాలపిస్తోంది. మమతల సాగర కెరటాలను మళ్ళి అక్కున చేర్చుకోంటో౦ది. మనిషి అంతర్ముఖుడై తనను తాను విక్షించుకున్నప్పుడు గోచరించే మనోజ్ఞ దృశ్యమిది. ఈ దృశ్యానికి ప్రతి బింబమే.......'సాగర్ కెరటం' -సి. ఉమాదేవి.© 2017,www.logili.com All Rights Reserved.