ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు పుట్టేనాటికి తెలుగునేల, భారతదేశ స్థితిగతుల గురించి తెలుసుకోవలసిన అవసరముంది. ఎందుకంటే ఏ రచయిత అయినా తాను జన్మించిన కాలంనాటి సమాజ ప్రభావం నుంచి దూరంగా రచనలు చేయలేడు. లక్ష్మీకాన్తమ్మగారి బహుముఖీనమైన ప్రతిభావికాసానికి దోహదపడిన అనేక అంశాలు నాటి సమాజ భూమిక లోనే ఉన్నాయనేది అక్షరసత్యం.
భారతదేశం బానిసత్వ శృంఖలాలు తెంచుకోటానికి ఆరాటపడుతున్న చైతన్యవంతమైన కాలం అది. మహాత్మాగాంధీ, గోఖలే, తిలక్ వంటి మహామహుల మార్గదర్శకవిత్వంలో దేశంలోని అన్ని ప్రాంతాలనుండి అనేకమంది త్యాగమూర్తులు ఉద్యమాగ్నిలోకి దూకారు. తెలుగునేల కూడా స్వతంత్రేచ్ఛతో ఉద్యమాన్ని పరవళ్ళు తొక్కించిన సందర్భం అది. " ఆంధ్రరత్న", ప్రకాశంపంతులుగారు, కొండా వెంటప్పయ్యగారు వంటి పెద్దలు గాంధీ స్పూర్తితో తెల్లదొరలకు ఎదురునిలిచి పోరాడుతున్న ఉజ్వలకాలం అది.