"రక్త మాంసాలతో ఉన్న అలాంటి ఒక వ్యక్తి ఈ భూమిపైన నడయాడడమంటే భావితరాల వారు నమ్మకపోవచ్చు" అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇన్ స్టీన్ - మహాత్మాగాంధీని ఒక మతోన్మాది హత్య చేశాడన్న వార్త వినగానే అన్న మాటలు! "మహాత్మాగాంధీని, తాజ్ మహల్ ను, కాశ్మీర్ ను చూడడానికి భారతదేశం వచ్చా"నని 1945 లో భారతదేశం వచ్చిన ఒక అమెరికన్ యాత్రికుని "భారతదేశంలో ఏమేమి చూడగోరుతున్నా" రని ప్రశ్నించినప్పుడు చెప్పిన జవాబు. మహాత్మాగాంధీ జయంతిని "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరపాలని సాక్షాత్తు ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి తీర్మానించింది!
గాంధీజీ భారత స్వాతంత్రోద్యానికి నాయకత్వం వహించి నడుపుతున్నప్పుడు ఆయనను బ్రిటిష్ ప్రధాని విన్ స్టీన్ చర్చిల్ "దిగంబర సన్యాసిగాని" అని ఈసడించాడు. ఐక్యరాజ్య సమితి "మహాత్మాగాంధి అహింసా సిద్ధాంతమే ఈ ప్రపంచానికి రక్ష" అని తీర్మానించినప్పుడు దాన్ని బలపరచిన రాజ్యాలలో ఈ బ్రిటన్ కూడా ఉండడం చర్చిల్ కు చెంపపెట్టు! కాగా, యావత్ ప్రపంచం అంగీకరించి, ఆరాధిస్తున్న మహాత్మాగాంధి జీవిత చరిత్రను ఇంగ్లీషులో రచించిన టెండుల్కగారు జగత్ప్రిసిద్ధుడు. ఇంగ్లీషులోని ఆ మహా గ్రంథానికి ఇప్పుడు "మహాత్మాగాంధీ మైక్" ప్రసిద్ధిగాంచిన గుంటూరుకు చెందినా ప్రముఖ గాంధేయవాది శ్రీ యెనిశెట్టి సాంబశివరావు గారు తెనిగించడం ముదావహం. గాంధీజీ జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
"రక్త మాంసాలతో ఉన్న అలాంటి ఒక వ్యక్తి ఈ భూమిపైన నడయాడడమంటే భావితరాల వారు నమ్మకపోవచ్చు" అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇన్ స్టీన్ - మహాత్మాగాంధీని ఒక మతోన్మాది హత్య చేశాడన్న వార్త వినగానే అన్న మాటలు! "మహాత్మాగాంధీని, తాజ్ మహల్ ను, కాశ్మీర్ ను చూడడానికి భారతదేశం వచ్చా"నని 1945 లో భారతదేశం వచ్చిన ఒక అమెరికన్ యాత్రికుని "భారతదేశంలో ఏమేమి చూడగోరుతున్నా" రని ప్రశ్నించినప్పుడు చెప్పిన జవాబు. మహాత్మాగాంధీ జయంతిని "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరపాలని సాక్షాత్తు ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి తీర్మానించింది! గాంధీజీ భారత స్వాతంత్రోద్యానికి నాయకత్వం వహించి నడుపుతున్నప్పుడు ఆయనను బ్రిటిష్ ప్రధాని విన్ స్టీన్ చర్చిల్ "దిగంబర సన్యాసిగాని" అని ఈసడించాడు. ఐక్యరాజ్య సమితి "మహాత్మాగాంధి అహింసా సిద్ధాంతమే ఈ ప్రపంచానికి రక్ష" అని తీర్మానించినప్పుడు దాన్ని బలపరచిన రాజ్యాలలో ఈ బ్రిటన్ కూడా ఉండడం చర్చిల్ కు చెంపపెట్టు! కాగా, యావత్ ప్రపంచం అంగీకరించి, ఆరాధిస్తున్న మహాత్మాగాంధి జీవిత చరిత్రను ఇంగ్లీషులో రచించిన టెండుల్కగారు జగత్ప్రిసిద్ధుడు. ఇంగ్లీషులోని ఆ మహా గ్రంథానికి ఇప్పుడు "మహాత్మాగాంధీ మైక్" ప్రసిద్ధిగాంచిన గుంటూరుకు చెందినా ప్రముఖ గాంధేయవాది శ్రీ యెనిశెట్టి సాంబశివరావు గారు తెనిగించడం ముదావహం. గాంధీజీ జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.