చరిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియజెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ప్రపంచామూ జరుపుకుంటుంది. అయితే, దీనిలోని విప్లవాంశము విస్మరించి కేవలం మొక్కుబడిగా జరుపుకునే ఒకానొక ధోరణి కార్మికవర్గ ఉద్యమంలో తలెత్తుతున్నది. హేమార్కెట్ అమరవీరుల త్యాగాలను మాటల్లో కీర్తిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల దాడులకు వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలను చేపట్టక పోవటం వల్ల ఆచరణలో మేడే దినోత్సవాల ఉద్దేశ్యమే వెనక్కు పోతున్నది.
పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చింది మేడే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. "ప్రపంచ కార్మికులారా ఐక్యంకండు" అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో అది మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. సకల దేశాలలోని కార్మికవర్గంపై నయా బానిసత్వాన్ని రుద్దేటందుకై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్న ప్రతిజ్ఞ తీసుకునేలా ప్రపంచ వ్యాప్తంగాగల కోట్లాది కార్మికులకు ఈనాటికీ మేడే స్పూర్తినిస్తూనే ఉన్నది.
చరిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియజెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ప్రపంచామూ జరుపుకుంటుంది. అయితే, దీనిలోని విప్లవాంశము విస్మరించి కేవలం మొక్కుబడిగా జరుపుకునే ఒకానొక ధోరణి కార్మికవర్గ ఉద్యమంలో తలెత్తుతున్నది. హేమార్కెట్ అమరవీరుల త్యాగాలను మాటల్లో కీర్తిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల దాడులకు వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలను చేపట్టక పోవటం వల్ల ఆచరణలో మేడే దినోత్సవాల ఉద్దేశ్యమే వెనక్కు పోతున్నది. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చింది మేడే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. "ప్రపంచ కార్మికులారా ఐక్యంకండు" అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో అది మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. సకల దేశాలలోని కార్మికవర్గంపై నయా బానిసత్వాన్ని రుద్దేటందుకై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్న ప్రతిజ్ఞ తీసుకునేలా ప్రపంచ వ్యాప్తంగాగల కోట్లాది కార్మికులకు ఈనాటికీ మేడే స్పూర్తినిస్తూనే ఉన్నది.© 2017,www.logili.com All Rights Reserved.