తిరుగుతూనే మనిషి జీవన మధువుని పొందగలడు.
తిరుగుతూనే మనిషి తియ్యని ఫలాలను పొందగలడు.
లోకేశ్వర్ గారి వెర్రి బహుగొప్పది. మూడున్నర లక్షల రూపాయలు చేతిలో పాడగా లక్షణంగా ... తందానాలాడవచ్చుగదా. అబ్బే.... తాష్కెంట్ నుంచీ బీజింగ్ వరకు రెండు ముపురాలు గల ఒంటెతో మొదలెట్టి సకల ప్రయాణ సాధనాల కిందా మీదా పడుతూ కష్టాలు పడీ చెడీ 'సిల్క్ రోడ్డు' మీద సాహసం చేస్తూ మహనీయమైన అనుభవాల మూట కట్టుకొచ్చి మన ముందు విప్పాడు. వెర్రంటే అదీ.స్వీయ పిచ్చితో పట్టు రోడెక్కాడు. ఆ మహాయనంలో తెలుగు జెండా నిలబెట్టాడు లోకేశ్వర్. యాత్రా సంస్కృతి, సాహిత్యాలు తక్కువగా ఉన్న తెలుగు వాకిట వారేవా అనిపించే తన పుస్తకం పరిచాడు.
ఈ యాబై అయిదు రోజుల 'సిల్క్ రూట్లో సాహసయాత్ర' చదువుతున్నంత సేపు మనం చదివిన పుస్తకాల పేర్లు, ప్రాంతాల పుట్టు పుర్వోతరాలు ఆవహించి రచయితగారి అనుభవాల లోయల్లోకి హాయిగా జారి అలా ఆయనతో నడుస్తూ పోవటం ఖాయం. మూడు పట్టు రహదారుల పురా చరిత్ర యాత్రా మార్గ చిత్రపటం మన ముందు పెట్టి హోరుమన్న తన కలల్ని నిజం చేసుకున్న తీరు చెప్పాడాయన.
- శివాజీ
మనల్ని మనం తెలుసుకోవాలంటే మన లోపలి నిగూఢ శక్తుల్ని బహిర్గతం చేసుకోవాలంటే, ఇటువంటి అరుదైన సాయసయాత్రల్ని చేయాలి. ఈ అనుభవాల సారంతో మనం మరింత పదును తేరుతాం. మనల్ని మనం మెరుగులు దిద్దుకుంటాం.ఈ యాత్రలు కూడా ఒక రకమైన ఆత్మావలోకనాలే. ప్రకృతి ఒడిలో ప్రయాణించడం అంటే మన అంతరంగిక ఆత్మలోకాలలోకి ప్రయాణించటమే!
తిరుగుతూనే మనిషి జీవన మధువుని పొందగలడు. తిరుగుతూనే మనిషి తియ్యని ఫలాలను పొందగలడు. లోకేశ్వర్ గారి వెర్రి బహుగొప్పది. మూడున్నర లక్షల రూపాయలు చేతిలో పాడగా లక్షణంగా ... తందానాలాడవచ్చుగదా. అబ్బే.... తాష్కెంట్ నుంచీ బీజింగ్ వరకు రెండు ముపురాలు గల ఒంటెతో మొదలెట్టి సకల ప్రయాణ సాధనాల కిందా మీదా పడుతూ కష్టాలు పడీ చెడీ 'సిల్క్ రోడ్డు' మీద సాహసం చేస్తూ మహనీయమైన అనుభవాల మూట కట్టుకొచ్చి మన ముందు విప్పాడు. వెర్రంటే అదీ.స్వీయ పిచ్చితో పట్టు రోడెక్కాడు. ఆ మహాయనంలో తెలుగు జెండా నిలబెట్టాడు లోకేశ్వర్. యాత్రా సంస్కృతి, సాహిత్యాలు తక్కువగా ఉన్న తెలుగు వాకిట వారేవా అనిపించే తన పుస్తకం పరిచాడు. ఈ యాబై అయిదు రోజుల 'సిల్క్ రూట్లో సాహసయాత్ర' చదువుతున్నంత సేపు మనం చదివిన పుస్తకాల పేర్లు, ప్రాంతాల పుట్టు పుర్వోతరాలు ఆవహించి రచయితగారి అనుభవాల లోయల్లోకి హాయిగా జారి అలా ఆయనతో నడుస్తూ పోవటం ఖాయం. మూడు పట్టు రహదారుల పురా చరిత్ర యాత్రా మార్గ చిత్రపటం మన ముందు పెట్టి హోరుమన్న తన కలల్ని నిజం చేసుకున్న తీరు చెప్పాడాయన. - శివాజీ మనల్ని మనం తెలుసుకోవాలంటే మన లోపలి నిగూఢ శక్తుల్ని బహిర్గతం చేసుకోవాలంటే, ఇటువంటి అరుదైన సాయసయాత్రల్ని చేయాలి. ఈ అనుభవాల సారంతో మనం మరింత పదును తేరుతాం. మనల్ని మనం మెరుగులు దిద్దుకుంటాం.ఈ యాత్రలు కూడా ఒక రకమైన ఆత్మావలోకనాలే. ప్రకృతి ఒడిలో ప్రయాణించడం అంటే మన అంతరంగిక ఆత్మలోకాలలోకి ప్రయాణించటమే!© 2017,www.logili.com All Rights Reserved.