వీణ తీగల్ని కొనగోట మీటితే.. తరంగాలు కర్ణపేయంగా ఉండి గుండె లోతులను తాకుతాయి. చిత్రకళాతపస్వి కుంచె కదిపితే కోటిభావాలు మదిలో మెదిలి మనస్సు అంత్యపొరలను కదిలిస్తాయి. నిర్మల కాసారంలో తాకిడికి పుట్టిన అలల్లా మనసులో ఎన్నో ఆలోచనలు మెదలి అమితానందం పొందేలా చేస్తాయి. ప్రస్తుతం సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం ఆయన జన్మస్థలం అయినప్పటికీ ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆయన చిత్రించిన 'ఛత్రపతి శివాజీ' బొమ్మ, భారత తొలి ప్రధానిని ఆకట్టుకొని, చిత్రకారుడ్ని చూడాలన్న కోరిక పుట్టించింది.
రవివర్మ చిత్రించిన చిత్రాలు కాలక్రమంలో రంగులు పోతే వాటిని సరిదిద్దే భాద్యత కుర్మాపు నరసింహం గారికి అప్పజెప్పబడింది. దేశంలో పేరొందినటువంటి చిత్రకారుల సరసన కూర్మాపు నరసింహం పేరు నిలిచింది. జపాన్ దేశం టోక్కోకు చెందిన బౌద్ధ అధ్యయన బృందం శాలిహుండం బౌద్ధ స్తూపాలను తిలకించి, నరసింహ ఫోటో ముందు మోకరిల్లారు. ఆయన చిత్రించిన చిత్రాలు వారి కుమారుల వద్ద లభిస్తాయి. ఆయన చిత్రించిన చిత్రాల ద్వారా జిల్లాకు కీర్తిని మిగిల్చి 1968 సెప్టెంబరు 28న తన 66వ ఏట అనంత లోకాలకు పయనమయ్యారు.
వీణ తీగల్ని కొనగోట మీటితే.. తరంగాలు కర్ణపేయంగా ఉండి గుండె లోతులను తాకుతాయి. చిత్రకళాతపస్వి కుంచె కదిపితే కోటిభావాలు మదిలో మెదిలి మనస్సు అంత్యపొరలను కదిలిస్తాయి. నిర్మల కాసారంలో తాకిడికి పుట్టిన అలల్లా మనసులో ఎన్నో ఆలోచనలు మెదలి అమితానందం పొందేలా చేస్తాయి. ప్రస్తుతం సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం ఆయన జన్మస్థలం అయినప్పటికీ ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆయన చిత్రించిన 'ఛత్రపతి శివాజీ' బొమ్మ, భారత తొలి ప్రధానిని ఆకట్టుకొని, చిత్రకారుడ్ని చూడాలన్న కోరిక పుట్టించింది. రవివర్మ చిత్రించిన చిత్రాలు కాలక్రమంలో రంగులు పోతే వాటిని సరిదిద్దే భాద్యత కుర్మాపు నరసింహం గారికి అప్పజెప్పబడింది. దేశంలో పేరొందినటువంటి చిత్రకారుల సరసన కూర్మాపు నరసింహం పేరు నిలిచింది. జపాన్ దేశం టోక్కోకు చెందిన బౌద్ధ అధ్యయన బృందం శాలిహుండం బౌద్ధ స్తూపాలను తిలకించి, నరసింహ ఫోటో ముందు మోకరిల్లారు. ఆయన చిత్రించిన చిత్రాలు వారి కుమారుల వద్ద లభిస్తాయి. ఆయన చిత్రించిన చిత్రాల ద్వారా జిల్లాకు కీర్తిని మిగిల్చి 1968 సెప్టెంబరు 28న తన 66వ ఏట అనంత లోకాలకు పయనమయ్యారు.© 2017,www.logili.com All Rights Reserved.