వారణాసికి నాలుగు మైళ్ళ దూరంలో 'లమహి' గ్రామం ఉంది. మున్షీ గురు సహాయ లాల్, గ్రామ పట్వారీ. వీరి పూర్వీకులది సమీపంలో ఉన్న ఆయిరే గ్రామం. కాని కుటుంబం లబాహిలో స్థిరపడింది. గురుసహాయ్ లాల్ పెద్దగా చదువుకున్న వాడు కాదు. అయినా వ్యవహార జ్ఞానం వున్నవాడు. ఆ ఊళ్లోనే కొంత పొలం సంపాదించాడు. ఆయనకు నలుగురు కుమారులు. అజాయబ్ లాల్ మూడో కుమారుడు. ఆనందీబాయి ఆయన భార్య. గురుసహాయ్ లాల్ మరణం తర్వాత బంధువులు పొలం విషయంలో మోసం చేశారు. అందుచేత అజాయబ్ లాల్ తపాలాశాఖలో గుమస్తాగా చేరాడు.
ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత 1880 లో జులై 31 వ తేదీన ప్రేమ్ చంద్ జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు 'ధన్ పత్ రాయ్' అందంగా వుండడం చేత తండ్రి 'నవాబ్ రాయ్' అనే పేరు పెట్టాడు. అందరూ 'నవాబ్' అని ముద్దు పేరుతో పిలిచేవారు. వీరు కాయస్థులు. శ్రీవాత్సవ శాఖకు చెందినవారు. మూడవ కుమార్తె 'సుగ్గి' పుట్టిన తర్వాత ఏడేళ్లకు ప్రేమ్ చంద్ జన్మించడం చేత ఆ కుటుంబంలోనూ, ఆ గ్రామంలోనూ పిల్లవాన్ని అందరూ ఎంతో గారాబంతో చూసేవారు. ఇక తల్లి సంగతి చెప్పనక్కరలేదు. అల్లారుముద్దుగా పెంచసాగింది.
వారణాసికి నాలుగు మైళ్ళ దూరంలో 'లమహి' గ్రామం ఉంది. మున్షీ గురు సహాయ లాల్, గ్రామ పట్వారీ. వీరి పూర్వీకులది సమీపంలో ఉన్న ఆయిరే గ్రామం. కాని కుటుంబం లబాహిలో స్థిరపడింది. గురుసహాయ్ లాల్ పెద్దగా చదువుకున్న వాడు కాదు. అయినా వ్యవహార జ్ఞానం వున్నవాడు. ఆ ఊళ్లోనే కొంత పొలం సంపాదించాడు. ఆయనకు నలుగురు కుమారులు. అజాయబ్ లాల్ మూడో కుమారుడు. ఆనందీబాయి ఆయన భార్య. గురుసహాయ్ లాల్ మరణం తర్వాత బంధువులు పొలం విషయంలో మోసం చేశారు. అందుచేత అజాయబ్ లాల్ తపాలాశాఖలో గుమస్తాగా చేరాడు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత 1880 లో జులై 31 వ తేదీన ప్రేమ్ చంద్ జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు 'ధన్ పత్ రాయ్' అందంగా వుండడం చేత తండ్రి 'నవాబ్ రాయ్' అనే పేరు పెట్టాడు. అందరూ 'నవాబ్' అని ముద్దు పేరుతో పిలిచేవారు. వీరు కాయస్థులు. శ్రీవాత్సవ శాఖకు చెందినవారు. మూడవ కుమార్తె 'సుగ్గి' పుట్టిన తర్వాత ఏడేళ్లకు ప్రేమ్ చంద్ జన్మించడం చేత ఆ కుటుంబంలోనూ, ఆ గ్రామంలోనూ పిల్లవాన్ని అందరూ ఎంతో గారాబంతో చూసేవారు. ఇక తల్లి సంగతి చెప్పనక్కరలేదు. అల్లారుముద్దుగా పెంచసాగింది.© 2017,www.logili.com All Rights Reserved.