వై వి రెడ్డిగా ప్రసిద్ధుడైన యాగా వేణుగోపాల రెడ్డి 1941 ఆగస్టు 17న కడప జిల్లా, రాజం పేట తాలూకాలోని పాటూరు అనే పల్లెటూరులో జన్మించారు. వీరిది చదువు విలువ తెలిసిన కుటుంబం. ఆర్ధికశాస్త్రంలో ఎం ఏ చేసిన తరువాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఐఏఎస్ కు 1964 లో ఎంపికయ్యారు. రాష్ట్ర కేంద్ర సర్వీసులలో కీలకమైన పదవులు నిర్వహించారు. స్నాతక, స్నాతకోత్తర స్థాయిల్లోనూ, పరిశోధనలోనూ ఆయన అధ్యయనాంశమైన ఆర్ధికశాస్త్రం ఆయన జీవితాన్నంతా నడిపించింది. ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతీయ రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా, గవర్నర్ గా పనిచేశారు.
ఐదేళ్ళ పాటు రిజర్వు బ్యాంకు గవర్నరు పదవిని నిర్వహించిన తొలి తెలుగువాడు వై వి రెడ్డి. తరువాత 14వ ఆర్ధిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్ధిక రంగానికి సంబంధించి ఇంగ్లీషులో అనేక ప్రామాణిక గ్రంథాలను రచించారు. 2010 లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో జన్మించి, దేశంలోనే అత్యున్నతమైన పదవులను అధిరోహించి, తన ఉద్యోగ జీవితమంతా సామాన్యుడి మేలు గురించే ఆలోచించిన వై వి రెడ్డిగారి ఆత్మాకథే ఈ 'నా జ్ఞాపకాలు'.
వై వి రెడ్డిగా ప్రసిద్ధుడైన యాగా వేణుగోపాల రెడ్డి 1941 ఆగస్టు 17న కడప జిల్లా, రాజం పేట తాలూకాలోని పాటూరు అనే పల్లెటూరులో జన్మించారు. వీరిది చదువు విలువ తెలిసిన కుటుంబం. ఆర్ధికశాస్త్రంలో ఎం ఏ చేసిన తరువాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఐఏఎస్ కు 1964 లో ఎంపికయ్యారు. రాష్ట్ర కేంద్ర సర్వీసులలో కీలకమైన పదవులు నిర్వహించారు. స్నాతక, స్నాతకోత్తర స్థాయిల్లోనూ, పరిశోధనలోనూ ఆయన అధ్యయనాంశమైన ఆర్ధికశాస్త్రం ఆయన జీవితాన్నంతా నడిపించింది. ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతీయ రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా, గవర్నర్ గా పనిచేశారు. ఐదేళ్ళ పాటు రిజర్వు బ్యాంకు గవర్నరు పదవిని నిర్వహించిన తొలి తెలుగువాడు వై వి రెడ్డి. తరువాత 14వ ఆర్ధిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్ధిక రంగానికి సంబంధించి ఇంగ్లీషులో అనేక ప్రామాణిక గ్రంథాలను రచించారు. 2010 లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో జన్మించి, దేశంలోనే అత్యున్నతమైన పదవులను అధిరోహించి, తన ఉద్యోగ జీవితమంతా సామాన్యుడి మేలు గురించే ఆలోచించిన వై వి రెడ్డిగారి ఆత్మాకథే ఈ 'నా జ్ఞాపకాలు'.© 2017,www.logili.com All Rights Reserved.