పత్రికారంగంలో, సాహిత్యరంగంలో నార్లవారి కృషి అద్వితీయం. అర్ధశతాబ్దం పైగా యావత్ ఆంధ్రప్రదేశాన్ని ఉర్రూతలాడించడమే కాక వారి ఆలోచనావిధానాన్ని మార్చివేశారు. వారి సంపాదకీయాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ ఎదురు చూసేదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి గౌరవం మరే సంపాదకుడికి దక్కలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను ప్రోత్సాహించి వారి చేత కొన్ని శీర్షికలు రాయించేవారు. భావాన్ని వ్యక్తీకరించుటలో విశేషతను, వైశిష్ట్యాన్ని సంతరించుకొన్న రచయితలలో నార్లవారు ప్రముఖులు. వారి శైలి నిర్దేశానికి వారి రచనలే సాక్ష్యం.
ఏ విషయమైనా సరే తను చెప్పదలచుకున్నదాన్ని, తను సత్యమని నమ్మిన విషయాన్ని నిర్మొహమాటంగా, ధైర్యంగా, జంకుగొంకులు లేకుండా సూటిగా చెబుతారు. న్యాయానికి, నిబద్దతకు ఎంతో విలువనిస్తారు. నేటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను చూస్తుంటే నార్లవంటి సంపాదకులు నేడు ఉండి ఉంటే ప్రజలకు ఎంత మార్గనిర్దేశం చేసేవారో అనిపిస్తుంది. విలక్షణమైన వారి వ్యక్తిత్వం, సాహిత్యం నన్ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ కారణంగా నేను నా మాటలలో వారిని గురించి వ్రాయడానికి సాహసించాను.
- డా. నార్ల లావణ్య
పత్రికారంగంలో, సాహిత్యరంగంలో నార్లవారి కృషి అద్వితీయం. అర్ధశతాబ్దం పైగా యావత్ ఆంధ్రప్రదేశాన్ని ఉర్రూతలాడించడమే కాక వారి ఆలోచనావిధానాన్ని మార్చివేశారు. వారి సంపాదకీయాల కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ ఎదురు చూసేదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి గౌరవం మరే సంపాదకుడికి దక్కలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను ప్రోత్సాహించి వారి చేత కొన్ని శీర్షికలు రాయించేవారు. భావాన్ని వ్యక్తీకరించుటలో విశేషతను, వైశిష్ట్యాన్ని సంతరించుకొన్న రచయితలలో నార్లవారు ప్రముఖులు. వారి శైలి నిర్దేశానికి వారి రచనలే సాక్ష్యం. ఏ విషయమైనా సరే తను చెప్పదలచుకున్నదాన్ని, తను సత్యమని నమ్మిన విషయాన్ని నిర్మొహమాటంగా, ధైర్యంగా, జంకుగొంకులు లేకుండా సూటిగా చెబుతారు. న్యాయానికి, నిబద్దతకు ఎంతో విలువనిస్తారు. నేటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను చూస్తుంటే నార్లవంటి సంపాదకులు నేడు ఉండి ఉంటే ప్రజలకు ఎంత మార్గనిర్దేశం చేసేవారో అనిపిస్తుంది. విలక్షణమైన వారి వ్యక్తిత్వం, సాహిత్యం నన్ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ కారణంగా నేను నా మాటలలో వారిని గురించి వ్రాయడానికి సాహసించాను. - డా. నార్ల లావణ్య© 2017,www.logili.com All Rights Reserved.