ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనంది చూడటం జరిగింది. చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్ళే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్ళు కొంతమంది. నాకు తెలుసి ప్రసాద్ గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్ళకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు.
తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే తిప్పించుకోవడం గాని ప్రసాద్ గారి తత్త్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తన దగ్గరికి ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగని వాళ్ళు కూడా ఆయనను ప్రేమిస్తారు.
నాకు తెలిసి ప్రసాద్ గారి మాట సాయం కోసం వెళ్ళిన అనేకమందికి ప్రాసాద్ గారే తిరిగి ఫోన్ చేసి, పని అయిందీ, లేనిదీ, వచ్చిన వాళ్ళు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవారి వగైరా.. వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్ గారి తత్త్వం.
ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనంది చూడటం జరిగింది. చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్ళే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్ళు కొంతమంది. నాకు తెలుసి ప్రసాద్ గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్ళకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు. తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే తిప్పించుకోవడం గాని ప్రసాద్ గారి తత్త్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తన దగ్గరికి ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగని వాళ్ళు కూడా ఆయనను ప్రేమిస్తారు. నాకు తెలిసి ప్రసాద్ గారి మాట సాయం కోసం వెళ్ళిన అనేకమందికి ప్రాసాద్ గారే తిరిగి ఫోన్ చేసి, పని అయిందీ, లేనిదీ, వచ్చిన వాళ్ళు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవారి వగైరా.. వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్ గారి తత్త్వం.© 2017,www.logili.com All Rights Reserved.